Share News

Viral: షాకింగ్.. ఎంత పని చేసిందీ గంగిరెద్దు! సైలెంట్‌గా కనిపిస్తూనే ఒక్కసారిగా..

ABN , Publish Date - Apr 05 , 2024 | 04:27 PM

స్కూటీపై వెళుతున్న ఓ వాహనదారుడిపై గంగిరెద్దు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. అతడికి ప్రాణాపాయం తప్పిన తీరు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Viral: షాకింగ్.. ఎంత పని చేసిందీ గంగిరెద్దు! సైలెంట్‌గా కనిపిస్తూనే ఒక్కసారిగా..

ఇంటర్నెట్ డెస్క్: జంతువులు.. ముఖ్యంగా గేదెలు, దున్నపోతులు వంటివి ఎప్పుడు ఏం చేస్తాయో చెప్పడం కష్టం. ఎంత అలర్ట్‌గా ఉన్నప్పటికీ వాటితో ఎప్పటికీ అపాయం పొంచి ఉంటుందని చెప్పే ఓ వీడియో నెట్టింట వైరల్‌గా(Viral) మారింది. ఓ గంగిరెద్దు వాహనదారుడిపై దాడి చేసిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. అసలు గంగిరెద్దు అకస్మాత్తుగా ఇలా ఎందుకు ప్రవర్తించిందో అర్థంకాక జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Viral: నువ్వు ఎప్పటికీ సింగిల్‌గా మిగిలిపోతావ్.. మహిళపై విమర్శల వర్షం.. ఏం జరిగిందంటే..


బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ గంగిరెద్దు వీధిలో వెళుతోంది. ఇంతలో ఎదురుగా ఓ స్కూటీ వచ్చింది. స్కూటీని చూసిన వెంటనే గంగిరెద్దు ఒక్కసారిగా రెచ్చిపోయింది. హఠాత్తుగా స్కూటీ ముందుకు దూకి వాహనాన్ని ఎత్తి పడేసింది. అప్పటికే వాహనదారుడి వైపు ఓ ట్రక్కు వస్తుండటంతో,, గంగిరెద్దు గాల్లోకి విసిరిన వ్యక్తి వెళ్లి ఆ వాహనం కింద పడ్డాడు. అయితే, ట్రక్కును నెమ్మదిగా పోనిస్తున్న డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనానికి బ్రేకులు వేయడంతో ప్రాణాపాయం తప్పింది (Bull Pounces on Man in Bengaluru).


వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. అప్పటిదాకా నెమ్మదిగా ఉన్న గంగిరెద్దు సడెన్ అంతలా ఎందుకు రెచ్చిపోయిందో అర్థం కాక నోరెళ్లబెట్టారు. కొందరు ట్రక్కు డ్రైవర్‌పై ప్రశంసలు కురిపించారు. అతడు వెంటనే స్పందించి బ్రేకులు వేసి ఉండకపోతే వాహనం బాధితుడిపై నుంచి వెళ్లిపోయేదని చెప్పారు. అదృష్టం అంటే ఇదే అని కొందరు అన్నారు.

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2024 | 04:31 PM