ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వామ్మో..! ఇంతకీ దీన్ని ఎవరైనా వడ అంటారా..

ABN, Publish Date - Apr 21 , 2024 | 07:39 PM

చాలా మంది హోటల్ నిర్వాహకులు పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. మరికొందరు వంట చేసే సమయంలో కనీస శుభ్రత కూడా పాటించడం లేదు. ఇక కొన్ని...

చాలా మంది హోటల్ నిర్వాహకులు పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. మరికొందరు వంట చేసే సమయంలో కనీస శుభ్రత కూడా పాటించడం లేదు. ఇక కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తమ హాస్టల్లో వంట పరిస్థితిని తెలియజేస్తూ షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘ఇంతకీ దీన్ని ఎవరైనా వడ అంటారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన హాస్టల్‌లో (Hostel food) చేసి టిఫిన్‌ నాణ్యతను అందరికీ చూపిస్తాడు. ప్లేట్‌లో సాంబార్, చట్నీ, వడ తీసుకొస్తాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాంబార్‌లో మునిగిన వడను (vada) బయటికి తీసి చేత్తో గట్టిగా పిండుతాడు. దీంతో లోపలి నుంచి నూనె ధారలుగా కారుతుంది. వండ బరువు కంటే అందులో ఉన్న నూనె బరువే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

Puzzle: ఈ రెండు చిత్రాల మధ్య 3 తేడాలున్నాయ్... అవేంటో కనుక్కోగలరా..

అంత నూనె కడుపులోకి వెళ్తే.. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వడను చూసి షాకైన అతను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘హాస్టల్ ఫుడ్ అంటే.. ఇలాగే ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వడలు తింటే పై ప్రాణాలు పైనే పోతాయి’’.. అంటూ మరికొందరు, ‘‘ఆయిల్లో వడ ఉన్నట్లుగా ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పులి భయపడితే ఎలా ఉంటుందో తెలుసా.. వేట కోసం వెతుకుతుండగా.. ఏనుగు రావడంతో..

Updated Date - Apr 21 , 2024 | 07:39 PM

Advertising
Advertising