Share News

Viral Video: పులి భయపడితే ఎలా ఉంటుందో తెలుసా.. వేట కోసం వెతుకుతుండగా.. ఏనుగు రావడంతో..

ABN , Publish Date - Apr 21 , 2024 | 05:58 PM

ఆకలితో ఉన్న పులి వేటకు దిగితే ఎలాంటి జంతువైనా దాని నోట చిక్కాల్సిందే. కొన్నిసార్లు నేరుగా దాడి చేస్తే.. మరికొన్నిసార్లు నక్కి నక్కి దాడి చేసి... ఎలాగోలా తమ ఆకలిని మాత్రం తీసుకుంటుంటాయి. అలాంటి పులులకూ కొన్నిసార్లు ఒళ్లు గగుర్పొడిచే సందర్భాలు ఎదురువుతుంటాయి. మరికొన్నిసార్లు...

Viral Video: పులి భయపడితే ఎలా ఉంటుందో తెలుసా.. వేట కోసం వెతుకుతుండగా.. ఏనుగు రావడంతో..

ఆకలితో ఉన్న పులి వేటకు దిగితే ఎలాంటి జంతువైనా దాని నోట చిక్కాల్సిందే. కొన్నిసార్లు నేరుగా దాడి చేస్తే.. మరికొన్నిసార్లు నక్కి నక్కి దాడి చేసి... ఎలాగోలా తమ ఆకలిని మాత్రం తీసుకుంటుంటాయి. అలాంటి పులులకూ కొన్నిసార్లు ఒళ్లు గగుర్పొడిచే సందర్భాలు ఎదురువుతుంటాయి. మరికొన్నిసార్లు వాటి గుండె గుభేల్‌మని కూడా అంటుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పులికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వేట వెతుకుతున్న పులికి.. ఏనుగుల గుంపు ఎదురుపడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులి (tiger) వేట కోసం వెతుకుతూ ఉంటుంది. అయినా దానికి ఏ జంతువూ కనిపించదు. దీంతో నిరాశతో రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. అంతలో దానికి పక్కన గడ్డి పొదల్లోంచి ఏనుగులు (elephants) వస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో అది ఒక్కసారిగా భయపడిపోయి.. రోడ్డు పక్కన నక్కి ఏనుగులకు కనిపించకుండా దాక్కుంటుంది. రోడ్డు పక్కనుంచి వచ్చిన మూడు ఏనుగులు వరుసగా ఒకదాని వెనుక మరోటి రోడ్డు దాటుకుని అవతలి వైపునకు వెళ్లిపోతాయి. అవి వెళ్లేంత వరకూ అలాగే నక్కి ఉన్న పులి... తర్వాత మెల్లాగా అటూ ఇటూ తిరుగుతుంది.

Viral Video: కలపడానికి ఇంకేమీ మిగల్లేదా..! ఈ పెద్దాయన చేసిన టీపై నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

అంతలో రోడ్డు పక్కన పొదల్లోంచి ఏదో అలికిడి వినపడుతుంది. ఏదైనా వేట దొరుకుతుందేమో అని పరుగెత్తుకుంటూ వెళ్లి చూస్తుంది. అయితే మరో ఏనుగు అక్కడి నుంచి రావడం చూసి భయంతో దూరంగా పారిపోతుంది. ఏనుగు కూడా పులిని భయపెడుతూ, అటు నుంచి అటే రోడ్డు అవతలి వైపునకు పారిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఏనుగంటే ఈ మాత్రం ఉండాలి మరి’’.. అంటూ కొందరు, ‘‘అడవికి రాజు ఏనుగు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఏసీ మిషన్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. శుభ్రం చేసేందుకు తెరిచిచూడగా..

Updated Date - Apr 21 , 2024 | 05:58 PM