Share News

Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో దూరిన పామును.. ఈమె ఎంత ఈజీగా పట్టేసిందో చూస్తే..

ABN , Publish Date - Apr 20 , 2024 | 03:24 PM

కొందరు పాములను పట్టడంలో ఎంతో అనుభవం కలిగి ఉంటారు. ఎలాంటి పాములనైనా ఎంతో సులభంగా పట్టేస్తుంటారు. అయితే కొన్నిసార్లు పాములు కూడా కంటికి కనిపించకుండా దాగుడుమూతలు ఆడుతుంటాయి. అయినా స్నేక్ క్యాచర్లు వాటిని ఎంతో తెలివిగా పట్టేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో దూరిన పామును.. ఈమె ఎంత ఈజీగా పట్టేసిందో చూస్తే..

కొందరు పాములను పట్టడంలో ఎంతో అనుభవం కలిగి ఉంటారు. ఎలాంటి పాములనైనా ఎంతో సులభంగా పట్టేస్తుంటారు. అయితే కొన్నిసార్లు పాములు కూడా కంటికి కనిపించకుండా దాగుడుమూతలు ఆడుతుంటాయి. అయినా స్నేక్ క్యాచర్లు వాటిని ఎంతో తెలివిగా పట్టేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్విమ్మింగ్ ఫూల్లో దూరిన పామును.. ఓ యువతి ఎంతో తెలివిగా పట్టుకోవడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద హోటల్ స్విమ్మింగ్ పూల్‌లోకి (Swimming pool) ఉన్నట్టుండి ఓ పెద్ద పాము (snake) చొరబడింది. దీంతో అప్పటిదాకా అందులో ఈత కొడుతున్న వారంతా భయంతో పరుగులు తీశారు. స్విమ్మింగ్ పూల్‌ లోకి దూరిన పాము.. చివరకు గోడపై ఉన్న ఓ రంధ్రంలోకి వెళ్లిపోయింది. దీంతో ఎవరూ పూల్‌ లోకి దిగే సాహసం చేయలేకపోయారు. చివరకు వారు స్నేక్ క్యాచర్‌కు (Snake catcher) సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న యువతి (young woman) .. ముందుగా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. గోడపైన రంధ్రంలోకి దూరిన పామును పట్టుకునే క్రమంలో ముందుగా స్టిక్‌ లోపలికి పెట్టి.. పాము బయటికి వచ్చేలా చేసింది.

Viral Video: గాడిదతో ఎగసెక్కాలు ఆడితే ఇలాగే ఉంటుంది.. ఇతడి పరిస్థితి ఏమైందో చూడండి..

తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే నేరుగా చేత్తో దాన్ని పట్టుకుని బయటికి తెచ్చింది. పామును పట్టుకోవడంతో అక్కడున్న వారంతా దాన్ని చూసేందుకు గుమికూడారు. చిన్న పిల్లలు పామును ఆసక్తిగా తిలకించారు. మొత్తానికి పామును పట్టుకోవడంతో అంతా.. హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎంత అనుభవం ఉన్నా ఇలాంటి సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 68 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో..! ఎంత ఎండగా ఉంటే మాత్రం ఇలా ఎవరైనా చేస్తారా.. ఈ విదేశీయుడు రోడ్డుపై చేస్తున్న పని చూస్తే..

Updated Date - Apr 20 , 2024 | 03:24 PM