Share News

Delhi Metro Video: రెండు కాళ్లు సీటుపై పెట్టిన యువకుడు.. పక్కనే మరో వ్యక్తి కూర్చోవడంతో.. చివరకు..

ABN , Publish Date - Apr 18 , 2024 | 07:19 PM

మెట్రో రైళ్లలో చోటు చేసుకునే వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సీటు కోసం మహిళ మధ్య జరిగే గొడవలు, వ్యూస్ కోసం యువతులు విచిత్రంగా వేసే డాన్సులు తదితర ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అందులోనూ...

Delhi Metro Video: రెండు కాళ్లు సీటుపై పెట్టిన యువకుడు.. పక్కనే మరో వ్యక్తి కూర్చోవడంతో.. చివరకు..

మెట్రో రైళ్లలో చోటు చేసుకునే వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సీటు కోసం మహిళ మధ్య జరిగే గొడవలు, వ్యూస్ కోసం యువతులు విచిత్రంగా వేసే డాన్సులు తదితర ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అందులోనూ ముంబై, ఢిల్లీ మెట్రో రైళ్లలో నిత్యం అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఢిల్లీ మెట్రో రైల్లో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. మెట్రో రైల్లో ఇద్దరు యువకుల మధ్య విచిత్రంగా గొడవ స్టార్ట్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రో (Delhi Metro) రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు రైల్లో సీటు ఖాళీగా ఉంది కదా అనే ఉద్దేశంతో కాళ్లు పైకి పెట్టి కూర్చుని ఉంటాడు. అంతలో మరో వ్యక్తి అక్కడికి వచ్చి.. అతడి పక్కనే కూర్చుంటాడు. అయితే పక్కన ఉన్న వ్యక్తి కూర్చున్న విధానం అతడికి నచ్చదు. కాళ్లు కిందకు పెట్టుకోవాలని సూచిస్తాడు. ‘‘నాకు ఇష్టం వచ్చినట్లు కూర్చుంటా.. నువ్వెవరు చెప్పడానికి’’.. అంటూ ఆ వ్యక్తి గొడవ పడతాడు.

Viral Video: వామ్మో.. ఇదేంటీ..! రాజమౌళి సినిమాలాగా ఉందే.. రెండస్థుల మేడలాగే కనిపిస్తున్నా...

ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర (Quarrel between youths) వాగ్వాదం నెలకొంటుంది. ఈ క్రమంలో రెండో వ్యక్తికి కోపం కట్టలు తెంచుకుంటుంది. యువకుడిపై చేయి చేసుకునే సమయంలో ఓ పోలీసు కానిస్టేబుల్ అక్కడికి వస్తాడు. ఇద్దరికీ నచ్చజెప్పి శాంతింపజేస్తాడు. దీంతో గొడవ సర్దుమణుగుతుంది. అయితే ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ఇది మహిళల గొడవలా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘రైళ్లలో నిత్యం ఇలాంటి దృశ్యాలే కనిపిస్తుంటాయి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదెలా సాధ్యం..! బండ రాయి కింద లంకెబిందె.. తెరచిచూడగా..

Updated Date - Apr 18 , 2024 | 07:22 PM