Share News

Viral Video: నడి రోడ్డుపై మ్యాన్‌హోల్ వద్ద వాహనదారులకు షాకిచ్చిన మహిళ.. మరో ఇద్దరితో కలిసి..

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:16 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏం జరిగినా.. అది ఫొటోలు, వీడియోల రూపంలో ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. అలాగే కొందరు బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇటీవల..

Viral Video: నడి రోడ్డుపై మ్యాన్‌హోల్ వద్ద వాహనదారులకు షాకిచ్చిన మహిళ..  మరో ఇద్దరితో కలిసి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏం జరిగినా.. అది ఫొటోలు, వీడియోల రూపంలో ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. అలాగే కొందరు బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇటీవల మహిళలు కూడా రద్దీగా ఉన్న జనం మధ్యలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఇద్దరు వ్యక్తులతో కలిసి నడి రోడ్డుపై చేసిన నిర్వాకం చూసి వాహనదారులు అవాక్కయ్యారు.


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై మ్యాన్‌హోల్‌ (Manhole) వద్ద ఇద్దరు వ్యక్తులతో కలిసి ఓ మహిళ ప్రవర్తించిన తీరు చూసి వాహనదారులంతా అవాక్కవుతున్నారు. నడి రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలన్నీ ఆగి ఉన్నాయి. అంతలో అర్ధనగ్నంగా ఉన్న ఓ మహిళ అక్కడికి నడుస్తూ వచ్చి ఓ మ్యాన్‌హోల్ వద్ద ఆగింది. ఆమెతో పాటూ మరో ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. ముందుగా వారిలో ఓ బాలుడు.. మ్యాన్‌హోల్ లోకి దిగి స్నానం చేశాడు. తర్వాత మహిళ కూడా (woman bathed in manhole) మ్యాన్‌హోల్‌లోకి మొత్తం మునిగింది.

Tiger attack Video: ఈ దున్నపోతు టైం బాగుంది.. ప్రాణాలు పోతాయనగా.. చివరి క్షణంలో..

తర్వాత తాపీగా బయటికి వచ్చింది. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా మ్యాన్‌హోల్‌లో మునిగాడు. ఇలా ఒకరితర్వాత ఒకరుగా ముగ్గురూ అందులో స్నానం చేశారు. ఈ ఘటన చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఎండలు భరించలేక అలా చేస్తున్నారా, లేక నిరసన తెలియజేసేందుకు ఇలా చేస్తున్నారా.. అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫ్లోరిడా వంటి దేశాల్లో నిరాశ్రయులంతా ఇలాగే చేస్తుంటారు’’.. అంటూ కొందరు, ‘‘ఎండ వేడికి భరించలేక ఇలా చేశారేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 మిలియన్లకు పైగా వ్యూస్‍‌ను సొంతం చేసుకుంది.

Viral Video: డెడికేషన్ అంటే ఇదీ.. స్కూటీలో వెనుక కూర్చుని ఈ బుడ్డోడు చేస్తున్న పని చూడండి..

Updated Date - Apr 20 , 2024 | 02:28 PM