Share News

Viral Video: ఇదెలా సాధ్యం..! బండ రాయి కింద లంకెబిందె.. తెరచిచూడగా..

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:57 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు నిధి కోసం వెతికే క్రమంలో ఓ పెద్ద బండరాయిని తొలగించాల్సి వస్తుంది. ఇందుకోసం రాయి చుట్టూ గొలుసు కట్టి.. ట్రాక్టర్ సాయంతో లాగుతారు. బండరాయిని పక్కకు తొలగించగానే భూమిలోపల..

Viral Video: ఇదెలా సాధ్యం..! బండ రాయి కింద లంకెబిందె.. తెరచిచూడగా..

‘‘ఫలానా ప్రాంతంలో, ఫలానా స్థలంలో భూమిలోపల బంగారు నిధి ఉంది. అయితే ఆ నిధికి కాపలాగా ఓ పాము కూడా ఉంది. కొన్ని పూజలు చేసి దాన్ని దూరంగా పంపించాలి’’.. చాలా మంది తాంత్రికులు అందరితో చెప్పే మాట ఇది. ఇలాంటి మాటలను గుడ్డిగా నమ్ముతూ కొందరు పురాత ఆలయాలు, ఇళ్లు తదితర ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టడం తరచూ జరుగుతూ ఉంటుంది. నిధులు బయటపడడం మాట పక్కనపెడితే చివరకు పోలీసులకు దొరికిపోయి జైలు జీవితం గడుపుతుంటారు. ఈ విషయం పక్కనే పెడితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇలాంటి తవ్వకాల వీడియోలు అనేకం వైరల్ అవుతుంటాయి. వాటిలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీనంతగా రూపొందిస్తుంటారు. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బండ రాయి కింద బయటపడ్డ లంకెబిందెను తెరవగా లోపలి నుంచి ఓ పాము బుసలుకొడుతూ బయటికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు నిధి (treasure) కోసం వెతికే క్రమంలో ఓ పెద్ద బండరాయిని తొలగించాల్సి వస్తుంది. ఇందుకోసం రాయి చుట్టూ గొలుసు కట్టి.. ట్రాక్టర్ సాయంతో లాగుతారు. బండరాయిని పక్కకు తొలగించగానే.. భూమిలోపల కూజా లాంటి ఆకారంలో ఇనుప వస్తువు బయటపడుతుంది. దాన్ని పక్కకు తీసుకొచ్చి మూతను తెరుస్తారు. అయితే ఆశ్చర్యకరంగా అందులో నుంచి ఓ పాము (snake) బుసలు కొడుతూ బయటకు వస్తుంది.

Viral Video: నడి రోడ్డుపై మ్యాన్‌హోల్ వద్ద వాహనదారులకు షాకిచ్చిన మహిళ.. మరో ఇద్దరితో కలిసి..

పాము బయటికి రావడంతో వారు ఒక్కసారిగా కంగారుపడతారు. పామును తొలగించిన తర్వాత అందులో ఉన్న బంగారు నాణేలను అన్నింటినీ పక్కకు తీస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇదేంటీ మరీ విచిత్రంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘భూమిలోపల పాత్రలో పాము బతికి ఉండడం అసాధ్యం.. ఇదంతా ఫేక్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: డెడికేషన్ అంటే ఇదీ.. స్కూటీలో వెనుక కూర్చుని ఈ బుడ్డోడు చేస్తున్న పని చూడండి..

Updated Date - Apr 18 , 2024 | 05:17 PM