Share News

Viral Video: వామ్మో.. ఇదేంటీ..! రాజమౌళి సినిమాలాగా ఉందే.. రెండస్థుల మేడలాగే కనిపిస్తున్నా...

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:21 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొన్ని వీడియోలు చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. వాహనాలను చిత్ర విచిత్రమైన ఆకారాల్లో తయారు చేయడం చూశాం. అలాగే వినూత్న ఆకారాల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం కూడా చూశాం. అయితే...

Viral Video: వామ్మో.. ఇదేంటీ..! రాజమౌళి సినిమాలాగా ఉందే.. రెండస్థుల మేడలాగే కనిపిస్తున్నా...

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొన్ని వీడియోలు చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. వాహనాలను చిత్ర విచిత్రమైన ఆకారాల్లో తయారు చేయడం చూశాం. అలాగే వినూత్న ఆకారాల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం కూడా చూశాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ విచిత్ర నిర్మాణాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఇదేంటీ..! రాజమౌళి సినిమాలాగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు.. పక్కన ఉన్న ఓ రెండస్థుల ఇంటిని (two story house) చూసి అవాక్కవుతున్నారు. ఆ ఇల్లు పైకి చూసేందుకు రెండస్థులతో నిర్మించారు. కింద వైపు వరుసగా కొన్ని షాపులు ఉన్నాయి. అలాగే పై రెండు అంతస్థుల్లోని గదులను ఫ్యామిలీస్ కోసం అద్దెకు ఇచ్చారు. ఆ ఇంటికి ముందు కొంత వరండా కూడా ఉంది. అందులో పూల మొక్కలు తదితరాలను కూడా ఏర్పాటు చేశారు. ఏంటి ఇంటికైనా ఇలాగే ఉంటుంది.. ఈ సోది అంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు.. అని మీకు సందేమం రావొచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది.

Puzzle: డైనింగ్ టేబుల్ వద్ద వీళ్లిద్దరిలో ఒకరు తప్పు చేస్తున్నారు.. అదేంటో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..

ముందు వైపు చూసేందుకు మాత్రమే అది రెండస్థల మేడ. తీరా వెనుక వైపు వెళ్లి చూస్తే.. అక్కడ ఖాళీ స్థలం ఉంది. కేవలం ఓకే గోడపై.. ముందు వైపు అలాంటి ఆకారాలను క్రియేట్ చేశారు. ఈ విచిత్ర నిర్మాణాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే..! ఇదేంటీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇది రాజమౌళి గ్రాఫిక్స్‌లా ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘సినిమా ఇళ్లులు ఇలాగే ఉంటాయి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదెలా సాధ్యం..! బండ రాయి కింద లంకెబిందె.. తెరచిచూడగా..

Updated Date - Apr 18 , 2024 | 06:54 PM