Share News

Viral Video: పడవలో వెళ్తుండగా నీటి అడుగున షాకింగ్ సీన్.. చేప లాగే కనిపించడంతో.. దగ్గరికి వెళ్లి చూడగా..

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:31 PM

సోషల్ మీడియాలో సముద్ర ప్రయాణానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. చేపలు పట్టే క్రమంలో వింత వింత జీవులు కనిపించడం జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు రోజూ చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా..

Viral Video: పడవలో వెళ్తుండగా నీటి అడుగున షాకింగ్ సీన్.. చేప లాగే కనిపించడంతో.. దగ్గరికి వెళ్లి చూడగా..

సోషల్ మీడియాలో సముద్ర ప్రయాణానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. చేపలు పట్టే క్రమంలో వింత వింత జీవులు కనిపించడం జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు రోజూ చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఇలాంటి వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. కొందరు పడవలో వెళ్తుండగా నీటి అడుగున వింత ఆకారం కనిపించింది. చేపలేమో అని సమీపానికి వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు పడవలో వెళ్తుండగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. పడవ చెట్ల మధ్యలో వెళ్తుండగా.. నీటి అడుగున వారికి వింత ఆకారం కనిపిస్తుంది. అదేదో పెద్ద చేప తరహాలో కనిపించడంతో సమీపానికి వెళ్లి చూస్తారు. తీరా చూస్తే.. అదేదో వింత జీవికి సంబంధించిన అస్తి పంజరంలా (skeleton) కనిపించింది.

Viral Video: నడి రోడ్డుపై మ్యాన్‌హోల్ వద్ద వాహనదారులకు షాకిచ్చిన మహిళ.. మరో ఇద్దరితో కలిసి..

పొడవాటి వెన్నెముక చుట్టూ పెద్ద పెద్ద ఎముకలు పేర్చినట్లుగా ఉన్నాయి. మొత్తం ఆకారాన్ని గమనిస్తే చాలా పెద్ద జీవికి సంబంధించిన అస్తి పంజరం తరహాలో కనిపించింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇలాంటి ఆకారాన్ని ఎప్పుడూ చూడలేదే’’.., ‘‘ఇదేదే అతి పెద్ద తిమింగళంలా ఉందే’’.. , ‘‘నీళ్లలో పెద్ద పెద్ద అరటిపండ్లలా ఉన్నాయి’’.. ‘‘ఎలుగు బంటి కొమ్ముల్లా ఉన్నాయి’’.., ‘‘హిప్పో అస్తిపంజరం’’.. అంటూ కొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇదెలా సాధ్యం..! బండ రాయి కింద లంకెబిందె.. తెరచిచూడగా బుసలు కొట్టిన పాము.. చివరకు..

Updated Date - Apr 18 , 2024 | 04:31 PM