ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వామ్మో.. నీటి అడుగున హోటల్ రూమ్.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..

ABN, Publish Date - Mar 14 , 2024 | 04:03 PM

విపరీతంగా పెరిగిపోతున్న జనాభా కారణంగా భూమిపై కాస్త స్థలం దొరకడం గగనమైపోతోంది. రోజు రోజుకు వెలుస్తున్న పట్టణాలు, నగరాలు భవిష్యత్ అవసరాలను తీర్చలేకపోతున్నాయి.

విపరీతంగా పెరిగిపోతున్న జనాభా కారణంగా భూమిపై కాస్త స్థలం దొరకడం గగనమైపోతోంది. రోజు రోజుకు వెలుస్తున్న పట్టణాలు, నగరాలు భవిష్యత్ అవసరాలను తీర్చలేకపోతున్నాయి. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలో వచ్చినవే నీటి లోపల నివాసాలు. పలు హోటళ్ల యాజమాన్యాలు నీటి లోపల రూమ్స్ ను ఏర్పాటు చేసి అతిథులకు చక్కని ఆతిథ్యం అందిస్తున్నాయి. సరికొత్త అనుభూతిని, అనుభాన్ని పంచుతున్నాయి. తాజాగా నీటి లోపల రూమ్ కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ ( Viral ) గా మారింది. ఇది ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా.. నెటిజన్లులో సరికొత్త భయాన్ని కలిగిస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో నీటి అడుగున నిర్మితమైన ఇంటికి సంబంధించింది. విశాలమైన వాకింగ్ కారిడార్, హాల్, బెడ్ రూమ్, కిచెన్, వాష్ రూమ్స్ తో పాటు లివింగ్ రూమ్స్ సైతం ఉన్నాయి. పూర్తిగా అద్దాలతో నిర్మితమైన ఈ ఇంట్లో నుంచి బయటకు చూస్తే అందమైన అద్భుతమైన ప్రదేశంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. చేపలు, జలచరాలు, నీటిలో నివసించే జంతువులు సమస్తాన్ని ఇంట్లో హాయిగా కూర్చునే ఆస్వాదించవచ్చు. ఈ ఇంటికి సంబంధించిన వీడియోను ఓ యువ జంట సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొద్ది కాలంలోనే ఈ క్లిప్ వైరల్ గా మారింది.


వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. నీటి అడుగున ఎలా జీవించగలుగుతారని, అద్భుతమైన దృశ్యాలు కొంత సమయం వరకేనని, చీకటయితే భయంకరంగా మారతాయని కామెంట్లు చేస్తున్నారు. ఫిబ్రవరిలో పోస్ట్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 75 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. అంతే కాకుండా నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లలో ప్రస్తావిస్తున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 04:03 PM

Advertising
Advertising