ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Jagan Manifesto: బాబోయ్ ఇదేం మేనిఫెస్టో.. రగిలిపోతున్న వైసీపీ కేడర్!!

ABN, Publish Date - Apr 27 , 2024 | 02:17 PM

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మేనిఫెస్టో-2024ను (YSRCP Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఇదేంట్రా బాబోయ్ అని తప్పకుండా మీకూ అనిపిస్తుంది. ఇంతకీ జగన్ రిలీజ్ చేసిన 2024 మేనిఫెస్టోకు.. 2019 మేనిఫెస్టోకు ఉన్న తేడాలేంటి..? అని బేరీజు చేసే పనిలో జనాలు, వైసీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు..

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మేనిఫెస్టో-2024ను (YSRCP Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఇదేంట్రా బాబోయ్ అని తప్పకుండా మీకూ అనిపిస్తుంది. ఇంతకీ జగన్ రిలీజ్ చేసిన 2024 మేనిఫెస్టోకు.. 2019 మేనిఫెస్టోకు ఉన్న తేడాలేంటి..? అని బేరీజు చేసే పనిలో జనాలు, వైసీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు. అయితే.. ఆశించిన రీతిలో మేనిఫెస్టో లేదని.. ఎన్నెన్నో ఊహించుకున్నాం కానీ జగన్ తుస్సుమనిపించారనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు.. వైసీపీ అగ్రనేతలు చాలా హామీలను మేనిఫెస్టోలో యాడ్ చేయాలని పదే పదే చెప్పినప్పటికీ జగన్ వారి మాటలను బేఖాతరు చేశారన్నది.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందుతున్న సమాచారం. పేరుకేమో రెండు పేజీలు, 9 ముఖ్యమైన హామీలు అని చెప్పుకుంటున్న జగన్.. ఇంతకుమించి కూటమి ప్రకటిస్తే పరిస్థితేంటి..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. డ్వాక్రా, రైతు రుణమాఫీలు ఉంటాయని ఆయా వర్గాలు ఎంతో ఆశపడ్డాయి.. తప్పుకుండా ఈ ప్రకటన ఉంటుందని వైసీపీ శ్రేణులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఆ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి.

YSRCP Manifesto 2024: 2 పేజీలు, 9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో.. ఇంతకీ అందులో ఏమున్నాయ్!?



కూటమి అలా.. జగన్ ఇలా!

ఇప్పటికే సూపర్ సిక్స్‌తో టీడీపీ ఎలా జనాల్లోకి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రజల నుంచి కూడా భారీగానే స్పందన వచ్చింది. రేపో మాపో పూర్తి మేనిఫెస్టోను బీజేపీ, జనసేన పార్టీలతో కలిపి టీడీపీ ప్రకటించబోతోంది. జగన్ మేనిఫెస్టోను మించి ప్రకటిస్తే మన పరిస్థితేంటని వైసీపీ అభ్యర్థులు, శ్రేణులు అయోమయంలో పడ్డారట. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. రోజుల కొద్దీ మెరుగులు, కసరత్తులు చేసింది ఈ మేనిఫెస్టో కోసమేనా అని వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు నిట్టూరుస్తున్న పరిస్థితి. అయితే.. ఇదే వైసీపీలోని మరో వర్గం నుంచి మాత్రం జగన్ చెప్పేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టారని.. 2019లాగే ఇప్పుడు కూడా ఇలాగే నవరత్నాలు అని చెప్పి వాటిని అక్షరాలా అమలు చేసిన ఘనత అధినేతది అని మాటలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే రగిలిపోతూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్న పరిస్థితి. కొందరు జగన్ వీరాభిమానులు అయితే.. ఇంకేముందిలే ఓడిపోయినట్లే పో.. అని తిట్టేస్తున్నారు.

YSRCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో వచ్చేసింది.. ఓ లుక్కేయండి..!



ఇంతకీ జగన్ మేనిఫెస్టోలో ఏమున్నాయ్..?

  • అమ్మఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు

  • వైఎస్‌ఆర్‌ చేయూత కొనసాగింపు

  • వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కొనసాగింపు

  • వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కొనసాగింపు

  • మహిళలకు రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ

  • సామాజిక పెన్షన్లను రెండు విడుతల్లో రూ.3,500లకు పెంపు

  • జనవరి 2028, జనవరి 2029లో రెండు విడుతల్లో పెన్షన్‌ పెంపు

  • కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు

  • అర్హులందరికీ ఇళ్లు పథకం కొనసాగింపు

  • రూ.2వేల కోట్లతో పట్టణాల్లో ఎంఐజీ ఇళ్లు

  • రైతుభరోసా సొమ్ము రూ.13,500 నుంచి రూ.16వేలకు పెంపు

పెన్షన్లు.. భీమా.. రైతు భరోసా ఇలా!

  • వృద్ధాప్య పెన్షన్లు 2 విడతల్లో రూ.3,500లకు పెంపు

  • మత్స్యకార భరోసా పథకం కొనసాగింపు

  • రైతు భరోసా సొమ్ము రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు

  • ఉచిత బీమా, పంటరుణాలు కొనసాగింపు

  • వాహనమిత్ర పథకం కొనసాగింపు

  • రాష్ట్రవ్యాప్తంగా 175 స్కిల్‌హబ్‌లు ఏర్పాటు

  • జిల్లాకు ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ

  • తిరుపతిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ

  • 500లకుపైగా అవాసాలున్న దళితకాలనీలను పంచాయతీలుగా మారుస్తాం

  • రాజధానిపై జగన్‌ నోట అదే పాట.. మళ్లీ మూడు ముక్కలాట

Updated Date - Apr 27 , 2024 | 02:22 PM

Advertising
Advertising