ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: విశాఖ వైసీపీలో ఆందోళన.. జగన్ ఇలా చేశారేంటబ్బా.. ఇప్పుడిదే హాట్ టాపిక్!

ABN, Publish Date - Apr 23 , 2024 | 11:55 AM

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్‌రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం జగన్‌ నగరంలో వేపగుంట జంక్షన్‌ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన..

ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆదివారం నాడు విశాఖపట్నం నగరంలో నిర్వహించిన రోడ్‌షో చప్పగా సాగడంతో ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. రోడ్‌షో ఆసాంతం అభివాదాలు/నమస్కారాలతోనే సీఎం జగన్‌ ముగించేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ముఖ్యమంత్రి రోడ్‌షో నిర్వహించడంతో పాటు ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddham) పేరిట ఏర్పాటుచేసిన సభల్లో పాల్గొన్నారు. ఆ జిల్లాలో పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి, గెలిపించాల్సిందిగా కోరారు. కానీ, నగరంలో అందుకు భిన్నంగా వ్యవహరించడం పార్టీ వర్గాలతోపాటు ప్రజల్లో చర్చనీయాంశమైంది.


అయ్యో.. అభ్యర్థులూ!

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్‌రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం జగన్‌ నగరంలో వేపగుంట జంక్షన్‌ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్కడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు. రోడ్‌షో ఆసాంతం బస్సుపై నిలబడి, కొన్నిచోట్ల లోపల కూర్చొని ప్రజలకు నమస్కారం/అభివాదం చేయడంతోనే సరిపెట్టేశారు. ఆయా నియోజకవర్గాల్లో రోడ్‌షో చేస్తున్నప్పుడు కనీసం అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థిని పరిచయం చేసే ప్రయత్నం చేయకపోవడంపై పార్టీ నేతల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బస్సు యాత్రలో భాగంగా జగన్‌ ప్రతి జిల్లాలో ఏదో ఒకచోట సభలో పాల్గొన్నారు. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి, వారిని పొగుడుతూ ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇలా జరిగిందేంటి..?

అనకాపల్లి జిల్లాలో కూడా సభ నిర్వహించడంతోపాటు పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. అలాంటిది రాష్ట్ర పరిపాలనా రాజధానిగా తాను స్వయంగా ప్రకటించిన విశాఖ నగరంలో మాత్రం ఎక్కడా ఒక సభ కూడా ఏర్పాటుచేయకపోవడం, నగర పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థులను కనీసం పరిచయం చేయకుండానే బస్సు యాత్రను ముగించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. జనాల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో సీఎం నిరుత్సాహానికి గురై ఉంటారని, అందుకే మొక్కుబడిగా రోడ్‌షో ముగించేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామం తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను కలవరపాటుకు గురిచేస్తోందని వైసీపీ నేతలే పేర్కొంటున్నారు. సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం వస్తున్నారని తెలిసి నగర పరిధిలో ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజల నుంచి సీఎం జగన్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ కానరాకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Read Latest National News and Telugu News.

Updated Date - Apr 23 , 2024 | 11:59 AM

Advertising
Advertising