Home » Bus Yatra
ఓ బస్ డ్రైవర్ బస్ నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. 80 కిలోమీటర్ల వేగంతో బస్సు నడుపుతూ సెల్ ఫోన్‌లో బిగ్‌బాస్ చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కర్నూలులో దగ్ధమైన వి కావేరి ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్లలో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సదరు బస్సుకు పలుసార్లు, పలురాష్ట్రాల్లో రెండు రకాలుగా రిజిస్ట్రేషన్లు చేయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఒడిశా, డామన్ అండ్ డయ్యులో..
గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు దసరా పండగ సెలవుల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లేందుకు టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని గ్రేటర్ ఈడీ ఎం. రాజశేఖర్ తెలిపారు.
గత 20 రోజుల నుంచి ఫిట్‌నెస్ లేకుండా, నిబంధనలు పాటించకుండా, తెలంగాణ ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీయే అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దాడులకు భయపడి బుధవారం తెల్లవారుజామున వనస్థలిపురం వద్దే బస్సులను నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.
ఒకసారి యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడానికి అలవాటుపడిన ప్రయాణీకుడు తరువాత నుంచి అదే యాప్‌తో టికెట్లు బుక్ చేయడానికి అలవాటుపడుతున్నారు. యాప్ ద్వారా టికెట్లను ఈజీగా బుక్ చేసుకోవడంతో పాటు చెల్లింపుల ప్రక్రియ సులభంగా ఉండటంతో బస్సు టికెట్లను యాప్స్ ద్వారా బుక్ చేసుకుంటుంటారు. కొందరు గ్రామీణ ప్రాంతాల ప్రజలు లేదా మొబైల్ యాప్‌లో ..
అక్టోబర్ 1 నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాన్ ఏసీ బస్సులో రూ.1000కి టికెట్ లభిస్తే.. రేపు అదే బస్సులో టికెట్ రూ.1500 నుంచి రూ.2000కు పెరగనుంది. అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఈ టికెట్ ధరలు..
విజయవాడ వరదలో చిక్కుకున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఆయన సోదరుడు లక్ష్మిప్రసాద్‌రెడ్డి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి రాయచోటి మున్సిపల్ సిబ్బందిని విజయవాడకు పంపించారు.
దాదాపు 40 మంది భారతీయ టూరిస్టులతో వెళ్తున్న బస్సు(bus) ఘోర ప్రమాదానికి(accident) గురైంది. అబుఖైరేని, తనహున్ సమీపంలోని మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులు మరణించారు.
ఇటివల అనేక చోట్ల పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలోనే స్కూల్ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న వ్యాన్లు, బస్సుల విషయంలో మాత్రం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వాహనాలు అనేక చోట్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ మినీ బస్సును పికప్ ట్రక్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది(accident). దీంతో అందులో ఉన్న స్కూల్ విద్యార్థుల్లో 12 మంది, డ్రైవర్ కూడా మృత్యువాత చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఉన్నావ్(Unnao)లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం(accident) చోటుచేసుకుంది. బీహార్‌లోని మోతిహారి నుంచి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృత్యువాత చెందగా, మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.