Dussehra festival: దసరాకు ఊరెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Sep 19 , 2025 | 08:00 AM
గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు దసరా పండగ సెలవుల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లేందుకు టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని గ్రేటర్ ఈడీ ఎం. రాజశేఖర్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు దసరా పండగ(Dussehra festival) సెలవుల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లేందుకు టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని గ్రేటర్ ఈడీ ఎం. రాజశేఖర్ తెలిపారు. కాలేజీలు, హాస్టళ్ల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నేరుగా వెళ్లేందుకు బస్సులు కావాల్సినవారు డిప్యూటీ రీజనల్ మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.

పటాన్‌చెరు, కూకట్‌పల్లి, గచ్చిబౌలి(Patancheru, Kukatpally, Gachibowli) ప్రాంతాలవారు డీఆర్‌ఎం 9959226148, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఉప్పల్ ప్రాంతాలవారు డీఆర్‌ఎం 9959226142, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, ఎల్‌బీనగర్, ఆదిభట్ట ప్రాంతాలవారు డీఆర్‌ఎం 9959226136, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, చార్మినార్, నారాయణగూడ ప్రాంతాలవారు డీఆర్‌ఎం 9959226129 సంప్రదించాలని సూచించారు.
ముచ్చింతల్‌కు..
ముచ్చింతల్(Muchinthal)ను సందర్శించేవారి కోసం నగరం నుంచి ప్రత్యేక బస్సులను ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు. కంటోన్మెంట్, ఉప్పల్, హఫీజ్‌పేట్(Uppal, Hafizpet), కూకట్‌పల్లి డిపోల నుంచి బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News