Congress: హనుమకొండలో రేవంత్ రెడ్డి రోడ్ షో
ABN, Publish Date - May 08 , 2024 | 12:09 PM
వరంగల్ జిల్లా: ‘‘డిసెంబర్‌లో గెలిచింది సెమీ ఫైనల్సే.. ఇప్పుడున్నవి ఫైనల్స్. అసలు కథ ఇప్పుడు మొదలైంది.. తెలంగాణ వర్సెస్ గుజరాత్.. ఎవరు గెలుస్తారో చూద్దాం.. ఫైనల్లో ఆ పక్కన నరేంద్రమోదీ, అమిత్‌షా.. ఈ పక్కన మీ అన్న ఉన్నడు.. రాహుల్‌గాంధీ ఉన్నడు.. మే 13న జరగబోయే దంగల్‌లో.. ఫైనల్‌లో.. గుజరాత్ టీమ్‌ను డకౌట్ చేసి చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది’’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి హనుమకొండ చౌరస్తా, వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్‌లో జరిగిన కార్నర్ మీటింగుల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
హనుమకొండ చౌరస్తా, పోచమ్మమైదాన్ సెంటర్‌లో మంగళవారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తరఫున హనుమకొండ చౌరస్తా, పోచమ్మమైదాన్ సెంటర్ కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.
హనుమకొండ చౌరస్తా, పోచమ్మమైదాన్ సెంటర్‌లో మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తున్న మంత్రి సీతక్క..
ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ చౌరస్తా, పోచమ్మమైదాన్ సెంటర్ కార్నర్ మీటింగ్‌లో ప్రజలకు నమస్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.. తదితరులు..
హనుమకొండ చౌరస్తా, పోచమ్మమైదాన్ సెంటర్‌లో మంగళవారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ చౌరస్తా, పోచమ్మమైదాన్ సెంటర్ కార్నర్‌లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు..
Updated Date - May 08 , 2024 | 12:09 PM