నందికొట్కూరు, డోన్‌లలో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:04 PM
నంద్యాల జిల్లా: గత ఐదేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికీ న్యాయం జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ వారి పాలిట రాక్షసుడిలా మారారని ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)పై ప్రత్యేక విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు న్యాయం చేస్తామని.. పీఆర్సీ, పింఛన్ సకాలంలో ఇచ్చి అండగా ఉంటామని వెల్లడించారు. ప్రజాగళంలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూర్, డోన్‌లలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఐదేళ్లుగా సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి, ఒక్క పత్రికా సమావేశం కూడా నిర్వహించని సీఎం జగన్ తప్ప దేశంలో మరెవరూ లేరన్నారు. సొంత ప్రయోజనాల కోసం కేబినెట్‌ను పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడన్నారు. సైకో జగన్‌రెడ్డికి ఒళ్లంతా అహంకారం పెరిగిపోయి, వ్యవస్థలను ధ్వంసం చేశారని.. అభివృద్ధిని విచ్చిన్నం చేసి, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ దోపిడీ దొంగ అని, సొంత బాబాయిని చంపి చెల్లెలి మీద కేసు పెట్టిన వ్యక్తికి ఓటు వేయకుండా ఇంటికి సాగనంపాలని చంద్రబాబు పిలుపిచ్చారు.
ప్రజాగళంలో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరుకు వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నందికొట్కూరు బహిరంగసభలో ప్రజలకు విక్టరీ సంకేతం చూపుతున్న దృశ్యం..
ప్రజాగళంలో భాగంగా నంద్యాల జిల్లా, నందికొట్కూరులో రోడ్ షోలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..
నందికొట్కూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ముస్లిం మహిళలు..
నంద్యాల జిల్లా నందికొట్కూరులో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..
ప్రజాగళంలో భాగంగా నంద్యాల జిల్లా, డోన్‌కు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్న దృశ్యం..
నంద్యాల జిల్లా, డోన్‌లో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డోన్‌లో నిర్వహించి ప్రజాగళం సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.
Updated Date - Apr 30 , 2024 | 12:04 PM