TDP: తూ.గో. జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు..
ABN, Publish Date - Apr 04 , 2024 | 11:00 AM
తూ.గో. జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంలో రోడ్ షో నిర్వహించారు. పసుపు, ఎరుపు, కాషాయ రంగులతో ఆ ప్రాంతం కళకళలాడింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులతో రోడ్ షో అదిరిపోయింది. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారరథంపై నుంచి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అరాచకం, నీచరాజకీయాలు, వైఫల్యాలను ఎండగట్టారు.
ప్రజాగళంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంకు వస్తున్న క్రమంలో అభిమానులు పూలవర్షం కురిపిస్తున్న దృశ్యం.
తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంకు టీడీపీ అధినేత చంద్రబాబు విచ్చేసిన సందర్బంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలకు విక్టరీ సంకేతం చూపిస్తున్న చంద్రబాబు..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం సెంటర్‌లో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.
ప్రజాగళంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంలో నిర్వహించిన రోడ్ షోకు తరలి వచ్చిన ప్రజానీకం..
తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంకు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మహిళా కార్యకర్తలు పూలు, హారతులతో స్వాగతం పలుకుతున్న దృశ్యం
Updated Date - Apr 04 , 2024 | 02:03 PM