శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న లోకేష్ దంపతులు
ABN, Publish Date - Jun 07 , 2024 | 11:02 AM
అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా గురువారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. పార్టీ ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు లోకేష్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజారిటీతో చరిత్రను తిరగరాసినందుకు ఎమ్మెల్యేలను, ఎంపీలను, కష్టపడి పార్టీని గెలిపించిన నాయకులను, కార్యకర్తలను లోకేష్ అభినందించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్న దృశ్యం.
మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఇస్తున్న హారతిని తీసుకుంటున్న లోకేష్, బ్రాహ్మణి దంపతులు...
ఏపీలో టీడీపీ ఘనవిజయం సాధించడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేష్‌ను కలిసి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.
రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించడంతో తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బచ్చయ్య చౌదరి తన కుమార్తెతో లోకేష్‌ను కలిసి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.
ఏపీలో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో ఆ పార్టీ నేత కాలవ శ్రీనివాసులు ఉండవల్లిలోని లోకేష్‌ను కలిసి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె దివ్య ఉండవల్లిలోని లోకేష్‌ను కలిసి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు నారా లోకేష్‌ను కలిసి మెడలో పూలదండ వేసి, కత్తిని బహుకరించి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.
టీడీపీ నేత కేశినేని చిన్న తదితరులు నారా లోకేష్‌ను కలిసి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.
రాష్ట్రంలో టీడీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి.. నారా లోకేష్‌ను కలిసి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.
Updated Date - Jun 07 , 2024 | 11:02 AM