ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: చంద్రబాబు ప్రజాగళం సభా దృశ్యాలు..

ABN, Publish Date - Apr 01 , 2024 | 10:20 AM

కర్నూలు జిల్లా: తెలుగు ప్రజలు నేడు రాతియుగంలో ఉన్నారని, వారిని స్వర్ణయుగంలోకి తెచ్చేందుకు కూటమి అధికారంలోకి రావాలని, కులం, మతం, ప్రాంతం అని చూడకుండా సమర్థులు, పాలనాదక్షులను ఎన్నుకోవాలని తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపిచ్చారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం, బాపట్ల జిల్లా కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్‌ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు. అప్పు చేయకపోతే పూటగడవని స్థితికి ప్రభుత్వం చేరుకుందన్నారు. ప్రస్తుతం పింఛన్లు ఇవ్వడానికి కూడా డబ్బులేక.. ఆ నెపం టీడీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

1/7

ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో జరిగిన ప్రజాగళం సభకు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.

2/7

తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులోని తెరు బజార్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.

3/7

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో మండుటెండను కూడా లెక్కచేయకండా చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన జనం..

4/7

ప్రకాశం జిల్లా, మార్కాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.

5/7

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో పాల్గొన్న అశేష జనవాహిని..

6/7

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం బాపట్లలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.

7/7

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న బాపట్లలో నిర్వహించిన ప్రజాగళం సభకు స్వచ్చంధంగా తరలివచ్చిన ప్రజలు..

Updated Date - Apr 01 , 2024 | 10:20 AM

Advertising
Advertising