ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narendra Modi: రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ

ABN, Publish Date - Jan 09 , 2024 | 08:28 AM

ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటన కోసం సోమవారం రాత్రి ఆయన అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీనే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటన కోసం సోమవారం రాత్రి ఆయన అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీనే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీకి రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్వాగతం పలికారు. విమనాశ్రయం నుంచి ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రెండు రోజుల అహ్మదాబాద్ పర్యటనలో మోదీ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తోపాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ శిఖరాగ్ర సదస్సులో పలువురు ప్రపంచ నేతలు పాల్గొనడం సంతోషంగా ఉందని, తన సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రాక ప్రత్యేకమైనదని ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు. ఈ వేదిక గుజరాత్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు.


‘‘రాబోయే రెండు రోజుల్లో నేను వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్, సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటాను. ఈ సమ్మిట్ సందర్భంగా వివిధ ప్రపంచ నాయకులు మాతో చేరడం ఎనలేని సంతోషకరమైన విషయం. నా సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రావడం చాలా ప్రత్యేకమైనది. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ గుజరాత్ అభివృద్ధికి చాలా దోహదపడింది. ఈ వేదిక చాలా మందికి అవకాశాలు సృష్టించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను." అని ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో మోదీ తెలిపారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం ఉదయం 9:30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌కు చేరుకుంటారు. అక్కడ వరుస సమావేశాల్లో పాల్గొంటారు. తన ఎజెండాలో భాగంగా ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు ఏర్పాటుచేయనున్నారు. ప్రముఖ కార్పొరేషన్‌ల సీఈఓలతో నిర్వహించే సెషన్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ప్రారంభించనున్నారు. ఇక జనవరి 10న ఉదయం 9:45 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో గల వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024ను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన టాప్ గ్లోబల్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశంకానున్నారు. అనంతరం మోదీ జీఐఎఫ్‌టీ(GIFT) సిటీకి వెళ్తారు. గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్‌షిప్ ఫోరమ్‌లోని ప్రముఖ వ్యాపార నాయకులతో సాయంత్రం 5:15 గంటలకు సమావేశం కానున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 08:28 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising