ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: 20న బెంగళూరుకు ప్రధాని మోదీ.. 24న ఉడుపికి యోగి ఆదిత్యనాథ్‌

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:03 PM

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) మరోసారి రానున్నారు. ఈనెల 20న శనివారం చిక్కబళ్ళాపుర, బెంగళూరు(Chikkaballapura, Bangalore)లలో అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.

బెంగళూరు: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) మరోసారి రానున్నారు. ఈనెల 20న శనివారం చిక్కబళ్ళాపుర, బెంగళూరు(Chikkaballapura, Bangalore)లలో అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చిక్కబళ్ళాపురకు చేరుకునే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగసభలో పాల్గొంటారు. చిక్కబళ్ళాపుర, కోలారు నియోజకవర్గాల అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో జరిగే బెంగళూరు ఉత్తర, సెంట్రల్‌, బెంగళూరు దక్షిణ, బెంగళూరు గ్రామీ ణ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.

ఇదికూడా చదవండి: Former Prime Minister: మాజీ ప్రధాని సంచలన కామెంట్స్.. ఆస్తి కోసం 9ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేశారు..

కాగా ఈనెల 24న తుమకూరు, చిత్రదుర్గ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది. అయితే 26న పోలింగ్‌ జరుగుతుండడంతో 24న ప్రచారానికి చివరి రోజు కానుంది. చివరి రెండు రోజులు అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచనున్నాయి. బీజేపీలో జాతీయ నేతల రాక మరింత పోటెత్తనుంది. ఇప్పటివరకు చిత్రదుర్గ, తుమకూరు అభ్యర్థుల తరపున ప్రచారం చేసే షెడ్యూల్‌ ఖరారు కాలేదు.

కాగా ఈనెల 24న ఉడుపి-చిక్కమగళూరు అభ్యర్థి కోట శ్రీనివాసపూజారి తరపున ప్రచారం కోసం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచ్చేయనున్నారు. రోడ్‌ షోతోపాటు ఓ సభలో యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath) పాల్గొననున్నారు. కాగా మరో వారం రోజుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రచారం కోసం వస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఇదికూడా చదవండి: మావోయిస్టులను కూకటివేళ్లతో పెకిలిస్తాం

Updated Date - Apr 18 , 2024 | 12:07 PM

Advertising
Advertising