Share News

Elections 2024: రామనవమి ఘర్షణలకు కారణం మమతే.. బీజేపీ స్ట్రాంగ్ ఆరోపణలు..

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:25 AM

శ్రీరామనవమి సందర్బంగా పశ్చిమ బెంగాల్‌లో ( West Bengal ) నిర్వహించిన రామనవమి ఊరేగింపులో జరిగిన ఘర్షణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణం అని బీజేపీ మండిపడింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌లో బుధవారం రామనవమి ఊరేగింపు జరిగింది

Elections 2024: రామనవమి ఘర్షణలకు కారణం మమతే.. బీజేపీ స్ట్రాంగ్ ఆరోపణలు..

శ్రీరామనవమి సందర్బంగా పశ్చిమ బెంగాల్‌లో ( West Bengal ) నిర్వహించిన రామనవమి ఊరేగింపులో జరిగిన ఘర్షణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణం అని బీజేపీ మండిపడింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌లో బుధవారం రామనవమి ఊరేగింపు జరిగింది. ఊరేగింపు సమయంలో ఘర్షణ చెలరేగింది. ఈ గొడవల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి స్పందించారు. హింసపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే రెచ్చగొట్టే ప్రసంగం చేశారని విమర్శించారు. ఆమె కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా ఊరేగింపులకు అంతరాయం కలిగిందని ఆరోపించారు.


Election commission: పోలింగ్ రోజు పర్యటన.. బెంగాల్ గవర్నర్‌కు ఈసీ బ్రేక్..

ఈ మేరకు గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ గవర్నర్‌కు లేఖ రాశారు. రామనవమి సందర్భంగా చేపట్టిన ఊరేగింపులపై జరిగిన దాడుల గురించి వివరించారు. రాష్ట్రంలో విఫలమైన లా అండ్ ఆర్డర్ పరిస్థితిని నియంత్రించాలని కోరారు. ఘటనలపై విచారణ జరిపేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. అవాంఛనీయ సంఘటనలకు దారితీసిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Sandeshkhali: సందేశ్‌ఖాళిలో షేక్ షాజహాన్ అండ్ కో ఆగడాలు.. ఎన్‌హెచ్ఆర్సీ రిపోర్టులో సంచలన విషయాలు

ముర్షిదాబాద్ జిల్లాలో రామ నవమి ఊరేగింపుపై జరిగిన దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. శక్తిపూర్ రామ్ నవమి ఉత్సవ్ కమిటీ నిర్వహించిన ఊరేగింపు ముర్షిదాబాద్‌లోని శక్తిపూర్ హైస్కూల్ వద్ద నుంచి వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీఎం మమత అండతో హిందువులపై దాడులు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 11:26 AM