Share News

Hyderabad: అందుబాటులోకి మరిన్ని ఎలక్ట్రిక్‌ నాన్‌ ఏసీ బస్సులు.. డిసెంబర్‌ నాటికి వెయ్యి

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:08 AM

గ్రేటర్‌లో బస్సుల సంఖ్య పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఈ మధ్య అందుబాటులోకి తెచ్చిన 23 ఎలక్ర్టిక్‌ నాన్‌ ఏసీ బస్సుల్లో(Electric non AC buses) ఆక్యూపెన్సీ 80-90 శాతం నమోదవుతోంది.

Hyderabad: అందుబాటులోకి మరిన్ని ఎలక్ట్రిక్‌ నాన్‌ ఏసీ బస్సులు.. డిసెంబర్‌ నాటికి వెయ్యి

- చర్యలు తీసుకుంటున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో బస్సుల సంఖ్య పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఈ మధ్య అందుబాటులోకి తెచ్చిన 23 ఎలక్ర్టిక్‌ నాన్‌ ఏసీ బస్సుల్లో(Electric non AC buses) ఆక్యూపెన్సీ 80-90 శాతం నమోదవుతోంది. వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుండడంతో అదే తరహాలో విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి 125-150 బస్సులను అందుబాటులోకి తెచ్చే దిశగా ఆర్టీసీ ప్రయత్నా లు చేస్తోంది. ఎలక్ర్టిక్‌ బస్సులకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ నెలకొనడంతో బస్సుల రాకలో కొంత జాప్యం జరుగుతోందని ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. మహాలక్ష్మి ప్రయాణంతో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఈ పథకానికి ముందు సిటీబస్సుల్లో రోజుకు ఐదు లక్షల మంది మహిళలు ప్రయాణాలు సాగిస్తే మహాలక్ష్మి పథకంతో రోజు వారీ మహిళా ప్రయాణికుల సంఖ్య 11 లక్షలకు పెరిగింది.

ఇదికూడా చదవండి: Ponnam Prabhakar: బీజేపీకి రూ.500 కోట్లు ఇచ్చినందుకే శరత్ చంద్రారెడ్డికి బెయిల్

రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచేందుకు ఉన్న అవకాశాలపై టీఎస్ ఆర్టీసీ(TS RTC) ప్రత్యేక దృష్టి సారించిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2019కి ముందు గ్రేటర్‌జోన్‌లో ఆర్టీసీ 3,800 బస్సులు నడుపుతూ రోజుకు 33 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించిం ది. ప్రస్తుతం 2,661 బస్సులతో రోజుకు 21 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. 2024 డిసెంబర్‌ నాటికి 450 ఎలక్ర్టిక్‌ బస్సులు మరో 500కు పైగా డీజిల్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఎలక్ర్టిక్‌ బస్సులు పెంచుకుంటే డీజిల్‌ ఖర్చుల భారం తగ్గడంతోపాటు ఆదాయం పెరుగుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రా.. రమ్మంటున్న రైల్‌ మ్యూజియం.. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ఉచిత ప్రవేశం

Updated Date - Apr 18 , 2024 | 11:11 AM