Share News

Hyderabad: రా.. రమ్మంటున్న రైల్‌ మ్యూజియం.. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ఉచిత ప్రవేశం

ABN , Publish Date - Apr 18 , 2024 | 09:07 AM

ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని కాచిగూడ రైల్వేస్టేషన్‌(Kachiguda Railway Station)లోని రైల్‌ మ్యూజియంలో నిర్వహిస్తున్నట్లు ముఖ్య ప్రజాసంబంధాల అధికారి రాకేశ్‌ తెలిపారు.

Hyderabad: రా.. రమ్మంటున్న  రైల్‌ మ్యూజియం.. నేడు ప్రపంచ వారసత్వ  దినోత్సవంగా ఉచిత ప్రవేశం

హైదరాబాద్‌ సిటీ: ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని కాచిగూడ రైల్వేస్టేషన్‌(Kachiguda Railway Station)లోని రైల్‌ మ్యూజియంలో నిర్వహిస్తున్నట్లు ముఖ్య ప్రజాసంబంధాల అధికారి రాకేశ్‌ తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో దక్షిణమధ్యరైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.ధనుంజయులు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, మ్యూజియంలోకి సాధారణ ప్రజలకు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 24 వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత నుంచి రూ.10 చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Google Lays Off Employees: ఉద్యోగులకు గూగుల్ షాక్.. భారీగా తొలగింపు..

మ్యూజియంలో అరుదైన వారసత్వ సంపద

1916 నాటి ఈ మ్యూజియంను అప్పటి నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ప్రారంభిస్తున్న అరుదైన ఫొటోలు, జాతిపిత మహాత్మాగాంధీ, తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతోపాటు ఎందరో సమరయోధులు రైళ్లలో ప్రయాణించిన ఫొటోలు మ్యూజియంలో ఉన్నాయని హైదరాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌(డీఆర్‌ఎం) లోకేష్‌ విష్టోయ్‌ తెలిపారు.

పాతబస్తీలో హెరిటేజ్‌ వాక్‌

ప్రపంచ హెరిటేజ్‌ దినోత్సవం సందర్భంగా నేడు హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌ తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఖైరతాబాద్‌, చార్మినార్‌ జోనల్‌ కమిషనర్లను రోనాల్డ్‌రోస్‌ ఆదేశించారు.

ఇదికూడా చదవండి: Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 18 , 2024 | 09:07 AM