Share News

Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Apr 18 , 2024 | 08:02 AM

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా ముందు పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే కొంత ఉన్నత వర్గాలకు, ధనిక కుటుంబాలకు చెందిన వారైతే..

Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా ముందు పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే కొంత ఉన్నత వర్గాలకు, ధనిక కుటుంబాలకు చెందిన వారైతే.. మార్కెట్లోకి వచ్చే నూతన మోడల్స్‌ను కొనుగోలు చేసి.. ఆ ఆభరణాలతో తమను అలంకరించుకుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర కొంత తగ్గుదల కొనిపిస్తే వెంటనే కొనుగోలు చేయడం చేస్తుంటారు. మరి ఈరోజు (18 ఏప్రియల్ 2024) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

సీనియర్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లు రూ.34 లక్షల కోట్లు


బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే ఏప్రియల్ 17 (బుధవారం) ధరతో పోలిస్తే గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గింది. గ్రాము బంగారం ధర రూ.6,794గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.67,940గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 7,412గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.74,120గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.


వివిధ నగరాలలో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి బుధవారంతో పోలిస్తే గురువారం గ్రాముకు రూపాయి తగ్గింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,809గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.68,090గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.7,427గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.74,270గా ఉంది.


దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.6,794గా ఉంది. అదే పది గ్రాముల బంగారం ధర రూ.67,940గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,412గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.74,120గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,869గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.68,690గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గ్రాము ధర రూ.7,494కు చేరుకోగా, పది గ్రాముల బంగారం ధర రూ.74,940గా ఉంది.


దేశంలో వెండి ధరలు

దేశీయంగా పసిడి ధరల బాటలో వెండి కూడా నడుస్తోంది. మన దేశంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వెండి ధర పరుగులు పెరుగుతూనే ఉన్నా, బుధవారంతో పోలిస్తే గురువారం స్వల్పంగా ధర తగ్గింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలో రూ.89,900గా ఉంది.


Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెచ్చు తగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి ఉండొచ్చు.

స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌పై రిటైల్‌ మదుపరుల ఆసక్తి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2024 | 08:10 AM