Share News

స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌పై రిటైల్‌ మదుపరుల ఆసక్తి

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:09 AM

మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) ఆఫర్‌ చేసే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ రిటైల్‌ మదుపరులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో వీరు...

స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌పై రిటైల్‌ మదుపరుల ఆసక్తి

రూ.2.43 లక్షల కోట్లకు చేరిన పెట్టుబడులు

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) ఆఫర్‌ చేసే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ రిటైల్‌ మదుపరులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో వీరు ఈ పథకాల్లో రూ.40,188 కోట్లు మదుపు చేశారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.18,085 కోట్లు ఎక్కువ. ఈ పెట్టుబడుల వరదతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాల నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 83 శాతం ఎక్కువ. ఇదే సమయంలో రిటైల్‌ మదుపరుల సంఖ్యా 1.09 కోట్ల నుంచి 1.90 కోట్లకు చేరింది. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌పై రిటైల్‌ మదుపరుల ఆసక్తికి ఈ కింది అంశాలు దోహదం చేశాయి.

  • పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ

  • లిస్టింగ్‌ కాని అనేక చిన్న కంపెనీలు ఐపీఓలకు రావడం

  • లార్జ్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ కంటే అధిక లాభాలు

  • జోరు మీద ఉన్న స్టాక్‌ మార్కెట్‌

  • దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు

  • ఆకర్షణీయమైన కంపెనీల ఆర్థిక ఫలితాలు

  • స్వల్ప వ్యవధిలోనే పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం

Updated Date - Apr 18 , 2024 | 06:09 AM