Share News

సీనియర్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లు రూ.34 లక్షల కోట్లు

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:16 AM

కంపెనీలు తమ రుణ పత్రాలపై అధిక వడ్డీ రేట్లు ఆఫర్‌ చేస్తున్నా, సీనియర్‌ సిటిజన్లు మాత్రం బ్యాంక్‌ డిపాజిట్లపైనే ఆసక్తి చూపిస్తున్నారు..

సీనియర్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లు  రూ.34 లక్షల కోట్లు

ఐదేళ్లలో 150 శాతం పెరుగుదల.. ఎస్‌బీఐ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: కంపెనీలు తమ రుణ పత్రాలపై అధిక వడ్డీ రేట్లు ఆఫర్‌ చేస్తున్నా, సీనియర్‌ సిటిజన్లు మాత్రం బ్యాంక్‌ డిపాజిట్లపైనే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గత ఏడాది (2023) చివరి నాటికి బ్యాంకుల్లో వీరి డిపాజిట్లు రూ.34.36 లక్షల కోట్లకు చేరాయి. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 150 శాతం ఎక్కువని ఎస్‌బీఐ రీసెర్చ్‌ ఒక నివేదికలో తెలిపింది. ఇదే సమయంలో బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్న సీనియర్‌ సిటిజన్ల సంఖ్య 81 శాతం పెరిగి 4.1 కోట్ల నుంచి 7.4 కోట్లకు చేరింది. దీంతో మొత్తం టర్మ్‌ డిపాజిట్లలో వీరి డిపాజిట్ల వాటా 15 శాతం నుంచి 30 శాతానికి చేరింది.

రూ.2.7 లక్షల కోట్ల వడ్డీ

గత ఐదేళ్లలో సీనియర్‌ సిటిజన్ల సగటు డిపాజిట్ల మొత్తం రూ.3,34,243 నుంచి రూ.4,63,3472కు చేరింది. ప్రస్తుతం బ్యాంకులు ఈ సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై సగటున 7.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన రూ.34.36 లక్షల కోట్ల సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లు, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎ్‌సఎ్‌స)పై రూ.2.7 లక్షల కోట్లు వడ్డీగా లభిస్తోంది.

బ్యాంకు డిపాజిట్లపైనే ఆసక్తి

సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్లపై ప్రస్తుతం బ్యాంకు లు సగటున 7.5ు వడ్డీ చెల్లిస్తున్నాయి. అదే సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎ్‌సఎ్‌స)లో పెట్టుబడి పెడితే సగటున 8.2 శాతం వడ్డీ వస్తోంది. అయినా బ్యాంకు టర్మ్‌ డిపాజిట్లపైనే సీనియర్‌ సిటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. 2023 డిసెంబరు నాటికి బ్యాంకుల్లో సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లు రూ.34.36 లక్షల కోట్లు ఉంటే, ఎస్‌సీఎ్‌సఎస్‌ పథకంలో ఉన్న డిపాజిట్ల మొత్తం రూ.1.62 లక్షల కోట్లు మాత్రమే. దీనిపై వారికి వచ్చిన వడ్డీవ రూ.13,000 కోట్లు.

రూ.27,000 కోట్ల పన్ను ఆదాయం

సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్‌ పథకాలు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలోనే పన్ను ఆదాయం సమకూర్చి పెడుతున్నాయి. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై ప్రభుత్వం సగటున 10 శాతం పన్ను విధిస్తోంది. ఈ లెక్కన సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్‌ స్కీమ్‌, ఎస్‌సీఎ స్‌ఎ్‌సపై ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి పన్నుల రూపంలో రూ.27,000 కోట్లు వసూలు చేయనుంది.

టర్మ్‌ డిపాజిట్లపై మక్కువ ఎందుకంటే..

  • ఇతర డిపాజిట్లతో పోలిస్తే అర శాతం నుంచి ముప్పావు శాతం అధిక వడ్డీ

  • రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు బీమా భద్రత

  • కంపెనీల రుణ పత్రాలతో పోలిస్తే అధిక భద్రత

  • సీనియర్‌ సిటిజన్ల కోసం బ్యాంకులు అందిస్తున్న ప్రత్యేక డిపాజిట్‌ పథకాలు

  • ఇతర పెట్టుబడి సాధనాల్లో మదుపు చేస్తే అసలుకు కూడా భద్రత ఉండదనే భయం

Updated Date - Apr 18 , 2024 | 06:16 AM