ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: ఎన్డీఏకు ఆర్ఎల్జీపీ గుడ్ బై.. కేంద్రమంత్రి పదవికి పశుపతి పరాస్ రాజీనామా..?

ABN, Publish Date - Mar 19 , 2024 | 11:24 AM

లోక్ సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వామ్య పక్షం రాష్ట్రీయ్ లోక్ జనశక్తి పార్టీ కూటమి నుంచి వైదొలగనుంది. ఇటీవల బీహర్ లోక్ సభసీట్లలో జరిగిన కేటాయింపులపై ఆర్ఎల్జీపీ అధినేత, కేంద్రమంత్రి పశుపతి పరాస్ గుర్రుగా ఉన్నారు. టికెట్ల విషయంలో బీజేపీ తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అంటున్నారు. సీట్ల కేటాయింపుపై బీజేపీ నాయకత్వం పునరాలోచించాలని కోరారు. బీజేపీ అధినాయకత్వం స్పందించకపోవడంతో కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పక్షం రాష్ట్రీయ్ లోక్ జనశక్తి పార్టీ (RLJP) కూటమి నుంచి వైదొలగనుంది. ఇటీవల బీహర్ లోక్ సభసీట్లలో జరిగిన కేటాయింపులపై ఆర్ఎల్జీపీ అధినేత, కేంద్రమంత్రి పశుపతి పరాస్ (Pashupati Paras) గుర్రుగా ఉన్నారు. టికెట్ల విషయంలో బీజేపీ తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అంటున్నారు. సీట్ల కేటాయింపుపై బీజేపీ నాయకత్వం పునరాలోచించాలని కోరారు. బీజేపీ అధినాయకత్వం స్పందించకపోవడంతో కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. మోదీ ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా పశుపతి కుమార్ పరాస్ (Pashupati Paras) ఉన్నారు. మంగళవారం నాడు (ఈ రోజు) మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు బీజేపీతో స్నేహం కొనసాగిందని, అభ్యర్థులపై అధికారిక ప్రకటన వరకు వేచి చూస్తామని పశుపతి అంటున్నారు. ఆ తర్వాత కూటమి నుంచి వైదొలిగే అంశంపై ప్రకటన చేస్తానని వెల్లడించారు.

పశుపతి పరాస్ (Pashupati Paras) దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు. పాశ్వాన్ చనిపోయిన తర్వాత పశుపతి పరాస్ (Pashupati Paras), పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ మధ్య పొసగలేదు. ఇద్దరు సొంతంగా పార్టీలు ఏర్పాటు చేశారు. పశుపతి పార్టీ ఆర్ఎల్జీపీ కాగా, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పార్టీ బాధ్యతలను చిరాగ్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ ఎన్డీఏ కూటమిలో ఉండటం విశేషం. పశుపతి పరాస్ 2019 నుంచి హాజీపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల లోక్ సబ సీట్లపై పేచీ రావడంతో కూటమి నుంచి బయటకు వచ్చేందుకు పశుపతి సిద్దం అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 11:24 AM

Advertising
Advertising