Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైలు
ABN, First Publish Date - 2024-01-04T08:18:08+05:30
భారత్ గౌరవ్ పథకం కింద సేవలను అందించే అత్యంత విజ యవంతమైన ప్రైవేట్ రైలు ‘ఉలా’ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తన తీర్థయాత్ర వివరాలను వెల్లడించింది.
అడయార్(చెన్నై): భారత్ గౌరవ్ పథకం కింద సేవలను అందించే అత్యంత విజ యవంతమైన ప్రైవేట్ రైలు ‘ఉలా’ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తన తీర్థయాత్ర వివరాలను వెల్లడించింది. వారణాసి - అయోధ్య - ప్రయాగ్ రాజ్(Varanasi - Ayodhya - Prayag Raj)కి ఫిబ్రవరి 8నుంచి 14వ తేదీ వరకు మొత్తం ఏడు రోజుల పాటు పవిత్ర నగరాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరిస్తూ కొనసాగుతుంది. వారణాసి పట్టణం ఆధ్యాత్మిక విశిష్టతను వివరించడం, అయోధ్యలోని రామమందిరంలో ప్రారంభోత్సవ్నాన చూడటం, ప్రయాగ్‌రాజ్ పవిత్ర సంగమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించేలా కొనసాగుతుంది. ఇది చెన్నై నుంచి బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు(Gudur, Nellore, Ongole), చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట్, మంచిర్యాల(Secunderabad, Kazipet, Mancheryala), సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్‌లలో ఆగి, పర్యాటకులను ఎక్కించుకుని బయలుదేరుతుంది. పర్యాటకులకు యాత్ర పొడవునా అన్ని ఆధ్యాత్మిక, చారిత్రాత్మక వివరాలను వెల్లడించేందుకు వీలుగా పీఏ సిస్టమ్స్, సీసీ కెమెరాలు, కోచ్ సెక్యూరిటీ, టూర్ మేనేజర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోటల్, సందర్శన, రవాణా, మూడు పూటలా దక్షిణ భారత భోజనం సహా వివిధ రకాలైన సౌకర్యాలను కల్పిస్తారు. యాత్రికులు ఎల్టీసీ, ఎల్‌ఎఫ్‌సీ సౌకర్యం కూడా పొందవచ్చు. ఇందులో స్లీపర్ క్లాస్ టిక్కెట్ రూ.16,400గాను, స్లీపర్ క్లాస్ (ఎకానమీ) టిక్కెట్ రూ.19,400, థర్డ్ ఏసీ (కంఫర్ట్) రూ.25,800, సెకండ్ ఏసీ (డీలక్స్) టిక్కెట్ రూ.31,800గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు నెం. 78761 01010లో లేదా ‘www.railtourism.com’ అనే వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చని ట్రావెల్ టైమ్స్ ప్రొడక్ట్ మేనేజర్ విఘ్నేష్ పేర్కొన్నారు.
Updated Date - 2024-01-04T08:18:10+05:30 IST