AP News: చంద్రబాబుతో టీడీపీ కీలక నేతల భేటీ.. కారణమిదే..?
ABN, Publish Date - Mar 19 , 2024 | 04:50 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ఆలూరు నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు కలిశారు. మంగళవారం నాడు చంద్రబాబుతో ఈ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ఆలూరు నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు కలిశారు. మంగళవారం నాడు చంద్రబాబుతో ఈ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. గడచిన గత ఐదేళ్లుగా ఆలూరు నియోజకవర్గం ఇన్‌చార్జిగా కోట్ల సుజాతమ్మ పనిచేస్తున్నారని చెప్పారు. కార్యకర్తలను వైసీపీ రౌడీ మూకల నుంచి ఆమె కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు. ఆలూరు సీటుపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబును వారు కోరారు. ప్రజల్లో ఉంటూ వారితో మమేకమైన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చెప్పామని అన్నారు.
TDP MP Candidates List Live Updates: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా వచ్చేసిందహో..!
అందుకు అధినేత సానుకూలంగా స్పందించారని తెలిపారు. చంద్రబాబు ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమం ఉండటంతో తమతో కొద్దిసేపు మాట్లాడారని అన్నారు. అనంతరం కంభంపాటి రామ్మోహన్‌ను కలిసి పరిస్థితులు వివరించామని చెప్పారు. ఆలూరు టికెట్ ప్రజల్లో ఉండే వ్యక్తికే కేటాయిస్తామని సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆలూరు టీడీపీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని అన్నారు. ప్రజల్లో ఉండే వ్యక్తికి సీటు ఇస్తే ఇక్కడ టీడీపీ తప్పకుండా గెలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
AP News: వైసీపీ నేతకు చెందిన బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుమందికి తీవ్రగాయాలు
Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డిని రహస్యంగా కలిసిన జనసేన నేత రాజబాబు..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 19 , 2024 | 04:50 PM