Share News

TDP MP Candidates List Live Updates: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా వచ్చేసిందహో..!

ABN , First Publish Date - Mar 19 , 2024 | 02:09 PM

TDP MP Candidates List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) గెలుపే లక్ష్యంగా కూటమి దూసుకెళ్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమిగా ఏర్పడిన రోజే గెలిచిపోయామని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక అభ్యర్థుల ప్రకటనలో యమా జోరుమీదున్న టీడీపీ.. ఇప్పటిదే దాదాపు అభ్యర్థులను ప్రకటించేసింది..

TDP MP Candidates List Live Updates: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా వచ్చేసిందహో..!

Live News & Update

  • 2024-03-19T14:15:25+05:30

    అభ్యర్థులు వీరే.. అధికారిక ప్రకటనే ఆలస్యం!

    • విజయవాడ : కేశినేని చిన్ని

    • శ్రీకాకుళం : రామ్మోహన్ నాయుడు

    • గుంటూరు : పెమ్మసాని చంద్రశేఖర్

    • నరసారావుపేట : లావు శ్రీకృష్ణదేవరాయులు

    • ఒంగోలు : మాగుంట రాఘవరెడ్డి

    • నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    • అనంతపురం : జేసీ పవన్ రెడ్డి

    • హిందూపురం : బీకే పార్థసారధి

    • నంద్యాల : బైరెడ్డి శబరి

    TDP-JANASENA-BJP-PATH.jpg

  • 2024-03-19T14:10:19+05:30

    ప్రకటన ఎప్పుడు..?

    ఎంపీ అభ్యర్థులపై టీడీపీ అగ్రనేతలు చేసిన కసరత్తు కొలిక్కి వచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికాసేపట్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. అయితే ఇవాళ 10 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న మరికొన్ని ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది.

  • 2024-03-19T14:00:08+05:30

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) గెలుపే లక్ష్యంగా కూటమి దూసుకెళ్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమిగా ఏర్పడిన రోజే గెలిచిపోయామని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక అభ్యర్థుల ప్రకటనలో యమా జోరుమీదున్న టీడీపీ.. ఇప్పటిదే దాదాపు అభ్యర్థులను ప్రకటించేసింది. అటు కూటమిలో భాగమైన జనసేన సైతం ఏడుగురు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక మిగిలింది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన మాత్రమే. మరోవైపు.. ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను వైసీ పీ (YSR Congress) ప్రకటించేయడంతో కూటమి మరింత జోరుపెంచింది. ఇక పెండింగ్‌లో ఉన్న కూటమిలోని ఎంపీ అభ్యర్థులను (TDP MP Candidates) ప్రకటించేయాలని ముహూర్తం ఫిక్స్ చేసింది టీడీపీ.