ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pattabhi:జగన్ సింగిల్ కాదు.. ఆయన వెంట మాఫియా

ABN, Publish Date - Mar 23 , 2024 | 08:59 PM

సీఎం జగన్(CM Jagan) సింగిల్ కాదని.. ఆయన వెంట మాఫియా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభి(Pattabhi) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ నేతలపై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ సీతారామాంజనేయులు నిఘా పెట్టే బదులు.. విశాఖలో డ్రగ్స్ ఎవరు తెచ్చారనే అంశంపై ఆయన దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

అమరావతి: సీఎం జగన్(CM Jagan) సింగిల్ కాదని.. ఆయన వెంట మాఫియా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభి(Pattabhi) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ నేతలపై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ సీతారామాంజనేయులు నిఘా పెట్టే బదులు.. విశాఖలో డ్రగ్స్ ఎవరు తెచ్చారనే అంశంపై ఆయన దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ మాఫియాకు.. ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఐపీఎస్లా కాకుండా.. జేపీఎస్ తరహాగా మారారని విరుచుకుపడ్డారు.

జగన్ పోలీస్ సర్వీసెస్ అన్నట్టుగా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారు తాడేపల్లి ప్యాలెస్‌లో బూట్లు పాలిష్ చేయడం కాదని ఎద్దేవా చేశారు. టెక్నాలజీతో తమపై నిఘా పెట్టడం కాదని.. డ్రగ్స్ కంటైనర్‌ వెనుక ఎవరు ఉన్నారో వారిని వెంటనే పట్టుకోవాలని చెప్పారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను కాపాడాలని సూచించారు. ఫోన్ల ట్యాపింగ్ విషయంలో వైసీపీ నేత కేశినేని నాని పాత్ర కూడా ఉందని అన్నారు. కేశినేని నానికి కోవర్టు నాని అనే పేరు కూడా ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేశినేని చిన్ని గెలుపు ఖాయం కావడంతో కేశినేని నానికి భయం పట్టుకుందని పట్టాభి అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 08:59 PM

Advertising
Advertising