ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yanamala: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇక అధోగతే

ABN, Publish Date - Apr 06 , 2024 | 04:37 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులుపాలు చేశారంటూ మండిపడ్డారు. రాబోయే ప్రభుత్వాల అప్పులను కూడా జగనే చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అధోగతే వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే జగన్ రెడ్డి ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చారన్నారు.

TDP Leader Yanamala Ramakrishnudu

అమరావతి, ఏప్రిల్ 6: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (CM Jagan Reddy) టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala Ramakrishnudu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులుపాలు చేశారంటూ మండిపడ్డారు. రాబోయే ప్రభుత్వాల అప్పులను కూడా జగనే చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అధోగతే వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే జగన్ రెడ్డి ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చారన్నారు. 2023-24లో ఆర్బీఐ నుంచే కేవలం మంగళవారం అప్పులే రూ.70 వేల కోట్లు చేశారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం రోజుకు రూ.257 కోట్లు చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు బహిరంగ మార్కెట్ అప్పులు చేసిందని వివరించారు.

Bird Flu: ముంచుకొస్తున్న ‘బర్డ్‌ఫ్లూ’ ముప్పు.. కొవిడ్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం


శాసనసభకు చెప్పి చేస్తామన్న అప్పులు ఇవి రెండింతలు ఎక్కువ అని అన్నారు. రాబోయే ప్రభుత్వాల అప్పులను కూడా జగన్ రెడ్డే చేయాలనుకుంటున్నారన్నారు. ఎన్నికల కోడ్ (Election Code) ఉండగానే 2024-25 ఆర్ధిక సంవత్సరం అప్పులలో రూ.20 వేల కోట్లు జూన్ 4 లోపే చేసేయాలని కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఆర్ధిక అధోగతి పాలుకాకుండా కాపాడుకోవాలంటే జగన్ రెడ్డిని ఓడించాల్సిందే అని స్పష్టం చేశారు. అప్పులతో కొనసాగే సంక్షేమ రాజ్యం ఎప్పటికైనా కూలిపోక తప్పదన్నారు. పేదలను సుస్థిరాభివృద్ధి వైపు నడిపించాలంటే అభివృద్ధితో కూడిన సంక్షేమం అందించే కూటమిని గెలిపించాలని యనమల రామకృష్ణుడు కోరారు.


ఇవి కూడా చదవండి...

Rajnath Singh: ఉగ్రవాదులు పాక్ పారిపోయినా విడిచిపెట్టం: రాజ్‌నాథ్ హెచ్చరిక

India-Maldives Row: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు.. ఎందుకో తెలుసా?

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 04:39 PM

Advertising
Advertising