Share News

Bird Flu: ముంచుకొస్తున్న ‘బర్డ్‌ఫ్లూ’ ముప్పు.. కొవిడ్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:14 PM

కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునేలోపే.. దాని వేరియంట్స్‌తో పాటు ఇతర వ్యాధులు భయంకరమైన పరిస్థితుల్ని నెలకొల్పుతున్నాయి. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు కొవిడ్‌కి మించిన మరో ప్రాణాంతక మహమ్మారి మానవులకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Bird Flu: ముంచుకొస్తున్న ‘బర్డ్‌ఫ్లూ’ ముప్పు.. కొవిడ్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం

కొవిడ్ (Covid 19) ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునేలోపే.. దాని వేరియంట్స్‌తో పాటు ఇతర వ్యాధులు భయంకరమైన పరిస్థితుల్ని నెలకొల్పుతున్నాయి. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు కొవిడ్‌కి మించిన మరో ప్రాణాంతక మహమ్మారి మానవులకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే బర్డ్‌ఫ్లూ (Bird Flu). ఇది అధిక మరణాల రేటుకి దారితీయొచ్చని, కొవిడ్ మహమ్మారి కన్నా 100 రెట్లు అధ్వాన్నంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

West Bengal: దీదీతో గొడవకు కారణం ఆ మంత్రే.. బెంగాల్ గవర్నర్ సంచలనం

అమెరికాలోని టెక్సాస్‌లో బర్డ్‌ఫ్లూకు చెందిన H5N1 వేరియంట్ తొలుత ఆవులకు, ఆ తర్వాత ఓ కార్మికుడికి వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కేసును ఏప్రిల్ 1వ తేదీన ‘‘యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ & ప్రివెన్షన్ (CDC)’’ ధృవీకరించింది. ఈ వ్యాధి లక్షణాల్లో కళ్లు ఎర్రగా మారడం ఒకటి. ఆ కార్మికుడికి కూడా వ్యాధి సోకిన వెంటనే కళ్లు ఎర్రగా మారడంతో.. అతడిని ఐసోలేషన్‌కి తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని, వైరస్ సోకిన వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ‘‘రోగిని ఒంటరిగా ఉంచాం. యాంటీవైరల్ డ్రగ్‌తో చికిత్స అందిస్తున్నాం’’ అని సీడీఎస్ తెలియజేసింది. కాగా.. ఓ వ్యక్తి బర్డ్‌ఫ్లూ బారిన పడటం ఇది మొదటిసారి కాదు. 2022లోనే అమెరికాలోని కొలరాడోలో తొలి కేసు నమోదైంది.

Viral Video: పిల్లల కోసం దొంగలా మారిన కుక్క.. యజమాని కళ్లుగప్పి అది చేసిన నిర్వాకం చూడండి..


పిట్స్‌బర్గ్‌లోని బర్డ్‌ఫ్లూ పరిశోధకుడు డా. సురేష్ కూచిపూడి మాట్లాడుతూ.. ‘‘ఈ వైరస్ కొన్ని దశాబ్దాలుగా మహమ్మారి జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు ఇది మహమ్మారికి దారితీసే అత్యంత ప్రమాదకరస్థాయికి చేరువలో ఉన్నాం’’ అని చెప్పారు. ఫార్మా ఇండస్ట్రీ కన్సల్టెంట్ మాట్లాడుతూ.. ఇది కొవిడ్ కంటే 100 రెట్లు అధ్వాన్నంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవులకు క్రమంగా వ్యాప్తి చెందింతే.. మరణాల రేటు గణనీయంగా ఉంటుందని హెచ్చరించారు. అప్పుడు దానిని నియంత్రించడం కష్టతరమవుతుందని ఇతర నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఏర్పడకుండా ఉండాలంటే.. ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలతో పాటు ఇతర చర్యలు తీసుకుంటే శ్రేయస్కరమని సలహా ఇస్తున్నారు.

Child Marriage: 12 ఏళ్ల బాలికతో 63 ఏళ్ల పూజారి పెళ్లి.. కథలో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

ఇదిలావుండగా.. ఈ బర్డ్‌ఫ్లూ కేసులు ఇతర దేశాల్లో నమోదైన సంఘటనలు కూడా ఉన్నాయి. 2003 జనవరి 1వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 26వ తేదీ వరకు.. మొత్తం 23 దేశాల్లో 887 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వారిలో 462 మంది మృత్యువాత పడినట్లు తేలింది. అంటే.. 52% మంది చనిపోయారు. దీన్ని బట్టి.. ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2024 | 03:15 PM