Share News

Child Marriage: 12 ఏళ్ల బాలికతో 63 ఏళ్ల పూజారి పెళ్లి.. కథలో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

ABN , Publish Date - Apr 04 , 2024 | 08:15 PM

బాల్య వివాహాలను చాలా దేశాల్లో నిషేధించడం జరిగింది. అయినప్పటికీ.. సాంప్రదాయం ముసుగులో బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. ఇటీవల పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలోనూ ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. నుమో బోర్కేటీ లావే త్సురు XXXIII అనే 63 ఏళ్ల ఆధ్యాత్మిక నాయకుడు 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు.

Child Marriage: 12 ఏళ్ల బాలికతో 63 ఏళ్ల పూజారి పెళ్లి.. కథలో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

బాల్య వివాహాలను చాలా దేశాల్లో నిషేధించడం జరిగింది. అయినప్పటికీ.. సాంప్రదాయం ముసుగులో బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. ఇటీవల పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా (Ghana) దేశంలోనూ ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. నుమో బోర్కేటీ లావే త్సురు XXXIII (Nuumo Borketey Laweh Tsuru XXXIII) అనే 63 ఏళ్ల ఆధ్యాత్మిక నాయకుడు 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి నాయకులు మద్దతివ్వడం పెద్ద దుమారానికి దారి తీసింది. ఈ పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వడంతో.. విస్తృతంగా విమర్శలొచ్చాయి. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.

Heatwave: మండిపోతున్న ఎండలు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు


ఈ నేపథ్యంలోనే.. ఆ పూజారి ప్రతినిధి ఒకరు ఈ బాల్య వివాహాన్ని సమర్థిస్తూ కళ్లుచెదిరే సమాధానం ఇచ్చాడు. ఈ వివాహం లైంగిక సంబంధం గురించి కాదని, ఆధ్యాత్మిక విధుల్లో తమ పూజారికి సహాయం చేస్తుందని పేర్కొన్నాడు. చట్టపరమైన వయస్సు (16 ఏళ్లు) వచ్చే వరకు.. ఆ అమ్మాయి వైవాహిక విధులను నిర్వర్తించదని చెప్పాడు. ‘‘ఇదేమీ వివాహ వేడుక కాదు. ఈ పెళ్లిలో లైంగిక సంబంధం అనేదీ ఏమీ లేదు. పూజారికి ఇప్పటికే ముగ్గురు సాంప్రదాయ భార్యలు ఉన్నారు. పూజారికి ఆధ్యాత్మిక విధుల్లో సహాయం ఆ అమ్మాయి ప్రధాన లక్ష్యం. అంతే తప్ప.. లీగల్ వయసు వచ్చేదాకా ఆమె వైవాహిక విధుల్ని నిర్వర్తించదు’’ అని ఆ ప్రతినిధి చెప్పినట్లు ఓ నివేదిక పేర్కొంది.

Matthew Miller: కేజ్రీవాల్ అరెస్ట్.. ఆ విమర్శలకు చెక్ పెట్టిన అమెరికా

మరోవైపు.. ఈ వివాహం వివాదాస్పదం కావడంతో ఆ బాలిక, ఆమె తల్లిని పోలీసు రక్షణలో ఉంచారు. అలాగే.. ఈ వ్యవహారంపై అటార్నీ జనరల్ దర్యాప్తు ప్రారంభించారు. ఒకవేళ ఆరోపణలు రుజువైతే.. ఈ పెళ్లిని ఓ క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని, సంబంధిత వ్యక్తులు ప్రాసిక్యూషన్‌ని ఎదుర్కోవలసి ఉంటుందని అటార్నీ జనరల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో.. ఈ పెళ్లిని రద్దు చేసి, ఆ పూజారిని విచారించాలని విమర్శకులు కోరుతున్నారు.

Updated Date - Apr 04 , 2024 | 08:18 PM