ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: నంద్యాల లోక్ సభ బరిలో బైరెడ్డి శబరి..? ఏ పార్టీ నుంచి అంటే..?

ABN, Publish Date - Mar 05 , 2024 | 11:49 AM

నంద్యాల లోక్ సభ బరిలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు శబరి రంగంలోకి దిగనున్నారా..? అంటే ఔననే అంటున్నారు ఆమె అనుచరులు. తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చిందని చెబుతున్నారు. శబరి టికెట్ గురించి కొద్దిరోజుల్లో అధికార ప్రకటన వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. బైరెడ్డి శబరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఆచి తూచి మరి అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. నంద్యాల (Nandyala) లోక్ సభ టికెట్‌ కోసం తెలుగుదేశం పార్టీలో (TDP) పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి రాయలసీమ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Byreddy Rajashekara Reddy) కుటుంబం నుంచి ఒకరికి టికెట్ ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ అనుకుంటుందని తెలిసింది. నంద్యాల లోక్ సభకు టీడీపీ నుంచి బైరెడ్డి కూతురు శబరి (Shabari) బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బైరెడ్డి శబరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో (BJP) ఉన్నారు.

బాణాసంచా కాల్చి, మిఠాయి పంచి

బైరెడ్డి శబరికి నంద్యాల తెలుగుదేశం పార్టీ టికెట్ ఖాయం అని సోమవారం రాత్రి నియోజకవర్గంలో తెగ ప్రచారం జరిగింది. పార్టీ అధికారికంగా మాత్రం టికెట్ ప్రకటించలేదు. టికెట్ ఖాయం అని, అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని టీడీపీ నేతలు వెల్లడించారు. దీంతో బైరెడ్డి అనుచరులు నరసింహా రెడ్డి నగర్ చౌరస్తా వద్ద మిఠాయిలు పంచి పెట్టారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. టికెట్ ఖరారు కాకముందే ఇంత హడావిడి ఎందుకు అని మరో వర్గం మండిపడింది.

ఇది కూడా చదవండి: YCP: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు బయలుదేరిన మంత్రి.. సాయంత్రం టీడీపీలోకి..

బైరెడ్డికి పాణ్యం టికెట్..?

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమించారు. సీమలో ఆయనకు మంచి పేరు ఉంది. జగన్ అరాచక పాలన నుంచి ప్రజలను రక్షించడమే తన ధ్యేయం అంటున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. బైరెడ్డికి పాణ్యం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఇటీవల ఫ్లెక్సీలు వెలిశాయి. బైరెడ్డి టికెట్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ఏ ప్రకటన చేయలేదు. బైరెడ్డి అనుచరులు మాత్రం తెగ హడావిడి చేస్తున్నారు. బైరెడ్డి శబరికి ఏకంగా లోక్ సభ టికెట్ దక్కనుందని ప్రచారం చేస్తున్నారు. శబరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. నంద్యాల లోక్ సభ టికెట్‌ను శబరికి ఇస్తామని టీడీపీ నేతలు ఆఫర్ చేశారని తెలిసింది. స్థానిక రాజకీయ పరిస్థితులు, సన్నిహితులతో సంప్రదింపులు జరిపిన తర్వాత బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: YCP: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు బయలుదేరిన మంత్రి.. సాయంత్రం టీడీపీలోకి..

Updated Date - Mar 05 , 2024 | 11:49 AM

Advertising
Advertising