ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Atchannaidu: జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా నష్టపోయింది

ABN, Publish Date - Mar 29 , 2024 | 08:21 PM

నేడు విధ్వంస జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా నష్టపోయిందని ఏపీ తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సామాజిక-సంక్షేమ విప్లవం తెలుగుదేశంతోనే సాధ్యమని చెప్పారు.

అమరావతి: నేడు విధ్వంస జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా నష్టపోయిందని ఏపీ తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సామాజిక-సంక్షేమ విప్లవం తెలుగుదేశంతోనే సాధ్యమని చెప్పారు. టీడీపీ ఆవిర్భావంతోనే సామాజిక-సంక్షేమ విప్లవం మొదలైందన్నారు. తెలుగు ప్రజలకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా నెం.1గా ఉండాలనేది తెలుగుదేశం ఆశయమని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే టీడీపీ ధ్యేయమన్నారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత టీడీపీదేనని చెప్పారు.

TDP MLA Candidates: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. గంటా పోటీ ఎక్కడ్నుంచంటే..?

అణగారిన వర్గాల్లో చైతన్యం కల్పించి సంక్షేమ రాజ్యానికి టీడీపీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ పోకడలపై తిరుగుబాటు చేశారన్నారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లని నినదించిన ఏకైక పార్టీ తెలుగుదేశమన్నారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో సంక్షేమ విప్లవం తెచ్చిన పార్టీ టీడీపీ అని చెప్పారు. విభజిత రాష్ట్రాన్ని విశ్వ నగరంగా మార్చేలా చంద్రబాబు ప్రయత్నించారని వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని.. అందుకోసం ప్రజలంతా ప్రతిన బూనాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Sri Bharath: పార్టీకి దూరమైన వారు తిరిగి రావాలనుకుంటే ఆదరిస్తాం..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 08:34 PM

Advertising
Advertising