ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: కదిరి మాజీ ఎమ్మెల్యేకు అనుకూలంగా తీర్పు... కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

ABN, Publish Date - Mar 22 , 2024 | 02:45 PM

Andhrapradesh: కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 1999, 2003లో నకిలీ డీడీలతో బంగారం కొనుగోలు చేశారని... కందికుంట వెంకటప్రసాద్‌పై సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. ఒక కేసులో ఐదు సంవత్సరాలు... మరో కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అప్పట్లో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.

అనంతపురం, మార్చి 22: కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌పై (Former MLA Kandikunta Venkataprasad)నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేసింది. 1999, 2003లో నకిలీ డీడీలతో బంగారం కొనుగోలు చేశారని... కందికుంట వెంకటప్రసాద్‌పై సీబీఐ(CBI) రెండు కేసులు నమోదు చేసింది. ఒక కేసులో ఐదు సంవత్సరాలు... మరో కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అప్పట్లో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.

BJP 4th List: బీజేపీ నాలుగో జాబితా విడుదల.. సినీనటి రాధికకు ఎంపీ టికెట్..


అయితే సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగగా.. కందికుంట వెంకటప్రసాద్‌కు అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో వెంకటప్రసాద్‌పై కేసులు కొట్టివేయడంతో ఆయన అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

Barrelakka: మరో అనౌన్స్‌మెంట్ చేసిన ‘బర్రెలక్క’.. త్వరలోనే శుభకార్యం అంటూ..


అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు డీడీల విషయంలో అవకతవకలు జరిగాయని కందికుంటపై సీబీఐ కేసు నమోదు చేసింది. డీడీలకు సంబంధించి రూ.8.29 కోట్లు కాజేశారనే కేసులో సీబీఐ కోర్టు కందికుంటకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా విధించింది. అలాగే హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో ఉన్న ఎస్‌బీఐ హుస్సేన్‌ ఆలం బ్రాంచ్‌లో కూడా నకిలీ డీడీలకు సంబంధించి మరో రూ.3.20 కోట్లు మోసగించారని సీబీఐ కోర్టు కందికుంటకు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కందికుంట తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కేసు కోర్టులో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు హైకోర్టు అనుమతించింది. అయితే దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఓ న్యాయవాది సుప్రీంలో పిటిషన్‌ వేయగా.. ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది. చివరకు ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణకు రాగా.. కందికుంట వెంకటప్రసాద్‌కు అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి..

Gorantla: గుడ్డలూడదీస్తా... ఖబడ్దార్.. మార్గాని భరత్‌కు గోరంట్ల హెచ్చరిక

MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత షెడ్యూల్ ఇదే..!


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 22 , 2024 | 03:18 PM

Advertising
Advertising