Share News

Barrelakka: మరో అనౌన్స్‌మెంట్ చేసిన ‘బర్రెలక్క’.. త్వరలోనే..

ABN , Publish Date - Mar 22 , 2024 | 02:05 PM

Barrelakka Marriage: బర్రెలక్క.. అలియాస్ ప్రిన్సెస్, అలియాస్ శిరీష(Shirisha).. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమెను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసింది. ఆ ఎన్నికల్లో(Telangana Assembly Elections) కంటెస్ట్ చేసి.. దేశ వ్యాప్తంగా యువత దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. త్వరలోనే జరుగబోయే ఎంపీ ఎన్నికల్లోనూ(Loksabha Elections) పోటీ చేస్తానని..

Barrelakka: మరో అనౌన్స్‌మెంట్ చేసిన ‘బర్రెలక్క’.. త్వరలోనే..
Barrelakka

Barrelakka Marriage: బర్రెలక్క.. అలియాస్ ప్రిన్సెస్, అలియాస్ శిరీష(Shirisha).. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమెను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసింది. ఆ ఎన్నికల్లో(Telangana Assembly Elections) కంటెస్ట్ చేసి.. దేశ వ్యాప్తంగా యువత దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. త్వరలోనే జరుగబోయే ఎంపీ ఎన్నికల్లోనూ(Loksabha Elections) పోటీ చేస్తానని ప్రకటించిన బర్రెలక్క.. ఇప్పుడు మరో అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే, ఇది ఎన్నికల గురించో.. రాజకీయ అంశాల గురించో కాదండోయ్.. తన వ్యక్తిగత అంశానికి సంబంధించి ప్రకటన చేసింది.

బర్రెలక్క త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతోంది. అవును, మీరు చదివిందే నిజమే.. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రెండు రోజుల క్రితమే సంబంధం కుదిరిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన బర్రెలక్క.. ‘నిశ్చితార్థం కోసం మేకప్ వేసుకుంటున్నాను ఫ్రెండ్. ఎలా ఉందో చెప్పండి’ అంటూ తాను మేకప్ వేసుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. అయితే, శిరీష ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది.. అతని పేరు, వివరాలు వెల్లడించలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘హాయ్ ప్రెండ్స్.. డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదని, బర్రెలు కాయాల్సి వస్తోంది’ అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో చేసిన ఒక్కపోస్టుతో శిరీష ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ పోస్టుతోనే శిరీష కాస్తా బర్రెలక్క అయ్యింది. అలా పాపులర్ అయిన బర్రెలక్క.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కొల్లాపూర్ నుంచి బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బర్రెలక్కకు ఎంతో మంది సపోర్ట్ చేశారు. మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, యువతీ యువకులు ఎంతో మంది సపోర్ట్ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో బర్రెలక్కకు పెద్దగా ఓట్లు పడలేదు. అయినప్పటికీ అధైర్య పడకని బర్రెలక్క.. ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించింది. ఇంతలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 04:28 PM