BRS to BJP: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన సీనియర్ నేత.. నేడో, రేపో అనుచరులతో కలిసి..
ABN, First Publish Date - 2023-10-22T08:07:07+05:30
ముషీరాబాద్ నియోజకవర్గం(Mushirabad Constituency) లోక్‌సత్తా పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుతం
రాంనగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్ నియోజకవర్గం(Mushirabad Constituency) లోక్‌సత్తా పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న పి.రోహిత్‌కుమార్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో జన్మించిన రోహిత్‌కుమార్ సతీమణి పి.సౌజన్య నాంపల్లి 7వ మెట్రోపాలిటన్ సీనియర్ జడ్జిగా కొనసాగుతున్నారు. జయప్రకాష్ నారాయణ లోక్‌సత్తా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీలో చేరి రాజకీయ శిక్షణ పొందేందుకు జర్మనీకి ఆయన వెళ్లివచ్చారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో, 2009, 2014లో మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. 2009లో ఆయన 16వేల ఓట్లను సాధించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన రోహిత్‌కుమార్ ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు స్థానికుడు నియోజకవర్గంపై మంచి పట్టున్నవ్యక్తి కావడంతో బీజేపీపెద్దలు కూడా పార్టీలో చేరాలని ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
Updated Date - 2023-10-22T08:07:08+05:30 IST