ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Kavitha ED Enquiry : కవిత ఫోన్లను ఈడీ ఏం చేసింది.. మళ్లీ నోటీసులుంటాయా.. ఎప్పుడేం జరుగునో అని బీఆర్ఎస్‌లో మళ్లీ మొదలైన టెన్షన్.. రేపో.. మాపో..!

ABN, First Publish Date - 2023-03-25T23:31:50+05:30

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi liquor Scam Case ) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (BRS MLC Kavitha) ఇప్పటి వరకూ మూడుసార్లు ఈడీ విచారించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi liquor Scam Case ) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (BRS MLC Kavitha) ఇప్పటి వరకూ మూడుసార్లు ఈడీ విచారించిన (Kavitha ED Enquiry) విషయం తెలిసిందే. మూడు రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ తర్వాత మళ్లీ నోటీసులుంటాయని కానీ.. ఇంకా విచారించాల్సి ఉందనే విషయం కానీ ఎక్కడా బయటికి రాలేదు. అయితే.. మూడోరోజు విచారణ పూర్తయిన తర్వాత మాత్రం మళ్లీ విచారణ రావాల్సి ఉంటే మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని కవితతో పాటు ఆమె న్యాయవాది సోమా భరత్‌కు (Soma Bharath) క్లియర్‌గా చెప్పి పంపారట. దీంతో ఎప్పుడు మళ్లీ నోటీసులొస్తాయో ఏంటో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో (BRS Cadre) మళ్లీ టెన్షన్ మొదలైందట. అసలు మళ్లీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందా..? సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ విచారణకు ముందే నోటీసులు వస్తాయా.. లేకుంటే ఆ తర్వాత వస్తాయా..? ఒకవేళ నోటీసులు ఇస్తే కవిత ఏవిధంగా రియాక్ట్ కాబోతున్నారు..? ఇప్పటికే సీఎం కేసీఆర్, న్యాయ నిపుణులతో కీలక భేటీలతో ఆమె ఏం సలహాలు తీసుకున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇంకా ఏమేం మిగిలున్నాయ్..?

- ఇప్పటి వరకూ కల్వకుంట్ల కవితపై మూడుసార్లు ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటిసారి లిక్కర్ పాలసీ విధానంలో పాత్ర.. అసలు మీరెందుకు ఇందులో తలదూర్చారు..? ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చారు..? ప్రత్యేక ఫ్లైట్‌‌ను ఎవరు అరెంజ్ చేశారు..? అసలు కోటాను కోట్లు డబ్బులు మీకు ఎలా వచ్చాయి..? ఆ డబ్బులు ఎవరి దగ్గర్నుంచి తీసుకున్నారు.. ఎందుకిచ్చారు.. ? ఇలా సుమారు 20 ప్రశ్నలకుపైగా కవితపై సంధించి మొదటి రోజు ఉక్కిరిబిక్కిరి చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాదు మొదటిరోజే కవిత తన వ్యక్తిగత ఫోన్‌ను కూడా ఈడీ అధికారులకు ఇచ్చేశారు.

- ఇక రెండోరోజు విషయానికొస్తే.. రామచంద్ర అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) ఎవరు..? గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchi Babu) ఎవరు..? ఆ ఇద్దరితో మీకున్న సంబంధాలేంటి..? ఈ ఇద్దరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న పాత్రేంటి..? ముఖ్యంగా మనీష్ సిసోడియాతో (Manish Sisodia) మీకు పరిచయం ఎలా ఏర్పడింది..? ఆయనకు ఎంత ముట్టజెప్పారు..? ఇందులో ఇంకా సూత్రదారులు..పాత్రదారులెవరు..? అనే విషయాలతోపాటు సుమారు 15 ప్రశ్నల వరకూ సంధించారని వార్తలొచ్చాయి.

- ఇక మూడో రోజు మాత్రం మొత్తం.. కవిత ఫోన్లు (Kavitha Phones) ధ్వంసం చేశారనే ఈడీ స్వయంగా ఆరోపణలు చేసింది. తనపై ఈడీ (Enforcement Directorate) లేనిపోని అభియోగాలు మోపుతోందని ఈడీ అధికారులు ఎన్ని ఫోన్లయితే అడిగారో వాటన్నింటినీ కవిత భద్రంగా ప్యాక్ చేసి సీల్డ్ కవర్‌లో ఈడీకి అందజేశారు కవిత. ఈ ఫోన్ల గురించే మూడోరోజు మొత్తం విచారణ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

- నాలుగోసారి విచారణకు పిలిపిస్తే మాత్రం మనీష్ సిసోడియా, పిళ్లై.. బుచ్చిబాబుతో ఎదురెదురుగా కూర్చొబెట్టి విచారించాలని ఈడీ భావిస్తోందట. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. కవిత ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని క్లోనింగ్‌కు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు ఆమె ఈ స్కామ్‌లో వాడిన ఫోన్లే అధికారులకు సమర్పించారా లేకుంటే వేరే ఫోన్లు ఇచ్చారా..? ఒకవేళ అవే ఫోన్లు అయితే అందులో డేటా ఉందా లేదా..? ఒకవేళ డేటా డెలీట్ అయ్యుంటే దాన్ని తిరిగి రికవరీ చేయడానికి ప్రత్యేకించి టెక్ నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణుల మధ్య ఈ వ్యవహారం మొత్తం ఈడీ అధికారులు చేయిస్తున్నట్లు తెలియవచ్చింది. అన్నీ మ్యాచ్ అయినా కాకున్నా మరోసారి కచ్చితంగా.. అది కూడా రేపో.. మాపో కవితను విచారణకు పిలిచే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయట. ఒక వేళ సుప్రీంలో విచారణ లోపు ఇవ్వకపోతే.. ఆ తర్వాత న్యాయస్థానం తీర్పును బట్టి ఈడీ అధికారులు ముందుకెళ్తారని తెలుస్తోంది.

- అయితే ఈసారి విచారణకు వెళ్తే మాత్రం కచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తారనే వార్తలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నోటీసులు ఎప్పుడొస్తాయో.. కవిత విచారణకు వెళితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని బీఆర్ఎస్‌ శ్రేణుల్లో టెన్షన్ అమాంతం పెరిగిపోయిందట. ఈసారి కచ్చితంగా ఫోన్ డేటా గురించే విచారణ మొత్తం ఉంటుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

అటు ఈడీ.. ఇటు కవిత..!

మరోవైపు.. డేటా మొత్తం తిరిగి సేకరించిన తర్వాత ఏం చేయాలనేదానిపై ఈడీ అధికారులు న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఆ పూర్తి వివరాలు వచ్చాక మరోసారి కవితకు నోటీసులు ఇచ్చే అవకాశం మెండుగా ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇటు కవిత కూడా మరోసారి నోటీసులిస్తే.. ఏం చేయాలి..? సుప్రీంకోర్టులో 27న వచ్చే పిటిషన్‌లో తన తరఫున ఎలాంటి వాదనలు వినిపించాలనే దానిపై సీఎం కేసీఆర్‌, లీగల్ సెల్, న్యాయ నిపుణులతో ప్రగతి భవన్‌ వేదికగా కవిత కూడా చర్చించారు. కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా సుమారు కొన్ని గంటల పాటు ఈ విషయాలపై చర్చించారు. రాజకీయంగా బీజేపీని.. న్యాయపరంగా ఈడీని ఎలా ఎదుర్కోవాలనే దానిపై నిశితంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని మొదట్నుంచీ టీఆర్ఎస్ ఒక పొలిటికల్ స్టంట్‌గానే చూస్తోంది. అయితే.. ఎలక్షన్ వరకు ఇది డ్రాగాన్ చేస్తారా.. లేకుంటే కేసును మరింత తీసుకెళ్లి కవితను అరెస్ట్ చేస్తారా..? అనేది తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

మొత్తానికి చూస్తే.. నాలుగైదు రోజులుగా అంతా సాఫీగా ఉన్నా సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌కు గంటలు దగ్గర పడేకొద్దీ బీఆర్ఎస్‌ శ్రేణుల్లో మాత్రం మళ్లీ టెన్షన్ మొదలైంది. మరి ఈడీ విచారణకు రావాలని నోటీసులు వస్తే పరిస్థితేంటి..? కవిత ఏం నిర్ణయం తీసుకుంటారు..? ఇక సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయా..? కవితకు అనుకూలంగా వస్తే సరే లేకుంటే ఎలా ముందుకెళ్తారో.. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి.. ఫైనల్‌గా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూద్దాం మరి.

****************************

ఇవి కూడా చదవండి

******************************

MLC Kavitha ED Enquiry : కవిత మీడియాకు చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేస్తే...!!

******************************

BRS MLC Kavitha : ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు కవిత.. సీఎం కేసీఆర్‌తో కీలక భేటీ.. ఏమేం చర్చిస్తున్నారంటే..!

******************************

MLC Kavitha ED Enquiry : విచారణలో రివర్స్ అటాక్.. కవిత ప్రశ్నలకు ఈడీ అధికారులు నీళ్లు నమిలారా.. కొసమెరుపు ఏమిటంటే..!

*****************************

YSRCP : ఓరి బాబోయ్.. సీఎం వైఎస్ జగన్ గురించి ఉండవల్లి శ్రీదేవి ఏమన్నారో చూడండి.. వీడియోలు నెట్టింట్లో వైరల్..

******************************

Kotam Reddy : వైఎస్ జగన్‌తో ఎక్కడ చెడింది.. 20 కోట్ల వ్యవహారమేంటి.. వైసీపీని వీడే ఎమ్మెల్యేల గురించి పూసగుచ్చినట్లుగా చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!

******************************

YSRCP : ఉండవల్లి, మేకపాటిపై వేటు వేసే పరిస్థితి ఎందుకొచ్చింది.. ఓటింగ్‌కు ముందు జగన్‌తో భేటీ.. ఆ అరగంటలో ఏం జరిగింది.. ఒక్క మాటతో..!

******************************

Updated Date - 2023-03-25T23:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising