BRS MLC Kavitha : ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు కవిత.. సీఎం కేసీఆర్‌తో కీలక భేటీ.. ఏమేం చర్చిస్తున్నారంటే..!

ABN , First Publish Date - 2023-03-22T17:04:37+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో (CM KCR) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) భేటీ అయ్యారు...

BRS MLC Kavitha : ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు కవిత.. సీఎం కేసీఆర్‌తో కీలక భేటీ.. ఏమేం చర్చిస్తున్నారంటే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో (CM KCR) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) భేటీ అయ్యారు. దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మూడోరోజు (Kavitha ED Enquiry) సుదీర్ఘ విచారణ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కవిత ప్రగతిభవన్‌కు (Pragathi Bhavan) వెళ్లారు. ఆమె వెంట భర్త అనిల్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు (KTR, Harish Rao) ఉన్నారు. కేసీఆర్‌తో ఈ ముగ్గురు భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాలుగా ప్రగతిభవన్‌ వేదికగా ఈ భేటీ జరుగుతోంది. గత మూడ్రోజులుగా ఢిల్లీ వేదికగా అసలేం జరిగింది..? అనే విషయాలను ఈ భేటీలో కీలకంగా చర్చిస్తున్నారు. ఈడీ విచారణ అంశాలను కేసీఆర్‌కు ఈ ముగ్గురు నిశితంగా వివరిస్తున్నారు.

Kavitha-And-KCR.jpg

ఇకపై ఈడీ విచారణ తీరు ఎలా ఉండబోతోంది..? కవిత పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చే తీర్పు, వాదనలు ఎలా ఉండాలన్నదానిపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా బీజేపీని (BJP) రాజకీయంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఈడీ రాజకీయంగా టార్గెట్ చేసిందని కవిత ఢిల్లీలో ఉన్నప్పుడే సంచలన లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అసలు పొలిటికల్‌గా ఈడీ ఏమేం ప్రశ్నలు అడిగింది..? కవిత సమాధానాలు ఏం చెప్పారు..? అనే విషయాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రగతిభవన్ నుంచే మొత్తం..!

వాస్తవానికి ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలను మినిట్ టూ మినిట్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశారు. అయితే విచారణలో ఏం జరిగిందనే విషయాలను కేసీఆర్ ఇప్పుడు కవితను అడిగి తెలుసుకుంటున్నారు. హస్తినలో ఈడీ విచారణ జరిగినప్పటికీ ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ అన్ని డైరెక్షన్స్ ఇస్తూ వస్తున్నారని వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే.. రెండోరోజు విచారణలో ఏం జరిగింది..? మూడోరోజు విచారణలో ఏం జరిగింది..? ఏమేం ప్రశ్నలు అడిగారు.. సమాధానం ఏం చెప్పారు..? అనే విషయాలను కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారని సమాచారం. కాగా.. కవితకు పార్టీ నుంచి, కుటుంబ సభ్యురాలిగా అన్ని విధాలుగా అండగా ఉంటామని మొదటిరోజు విచారణకు వెళ్లినప్పుడే కేసీఆర్ అభయమిచ్చి ఢిల్లీకి పంపారు. కవిత వెంట మొదటి రోజు నుంచీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్.. మహిళా మంత్రులు, ముఖ్య నేతలు ఉన్నారు. ముఖ్యంగా ఈడీ విచారణ మొత్తమ్మీద కవితకు అన్నితానై సీనియర్ న్యాయవాది సోమాభరత్ చూసుకుంటూ వస్తున్నారు. ఈ భేటీలో భరత్ విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రగతిభవన్‌లోనే పండుగ..!

ఢిల్లీ నుంచి నేరుగా కవిత ప్రగతిభవన్‌కు వస్తున్నారని కవిత పిల్లలు, కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు హరీష్ రావు కుటుంబ సభ్యులు కూడా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఇలా కుటుంబ సభ్యులందరితో కలిసి కవిత ప్రగతిభవన్‌లోనే ఉగాది పండుగ చేసుకుంటున్నారు. కాగా.. కేసీఆర్‌తో ఈ భేటీ సాయంత్రం ఆరు గంటల వరకూ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాయంత్రం తర్వాత కవిత తన నివాసంలో మీడియా మీట్ నిర్వహించే ఛాన్స్ ఉంది. బుధవారం సాయంత్రం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

MLC Kavitha ED Enquiry : కవిత మీడియాకు చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేస్తే...!!


******************************

MLC Kavitha ED Enquiry : విచారణలో రివర్స్ అటాక్.. కవిత ప్రశ్నలకు ఈడీ అధికారులు నీళ్లు నమిలారా.. కొసమెరుపు ఏమిటంటే..!

******************************

Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు ఈడీకి కవిత సంచలన లేఖ.. ఇందులో లాజిక్ ఏమిటంటే..?


******************************
Kavitha ED Enquiry : ఈడీ విచారణకు వెళ్తూ పాత ఫోన్లు చూపించిన కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోయిన టెన్షన్..

******************************

MLC Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు కవిత కీలక సమావేశం.. ఈడీ ఆఫీసు చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు.. కీలక పరిణామాలుంటాయా..!?


******************************

Updated Date - 2023-03-22T17:16:30+05:30 IST