MLC Kavitha ED Enquiry : కవిత మీడియాకు చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేస్తే...!!

ABN , First Publish Date - 2023-03-21T18:31:46+05:30 IST

గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి ఒక్కటే చర్చ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను..

MLC Kavitha ED Enquiry : కవిత మీడియాకు చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేస్తే...!!

గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి ఒక్కటే చర్చ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు మూడోసారి ఏం విచారిస్తున్నారు..? ఇవాళ అరెస్ట్ (Arrest) చేస్తారా లేకుంటే.. కవిత సేఫ్‌గా తిరిగి ఇంటికొస్తారా..? అనేదానిపై ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చించుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కవిత ఇవాళ ఈడీకి సమర్పించిన మొబైల్స్ (Kavitha Mobiles) కొత్తవా..? లేకుంటే పాతవా..? అనేది అనేక మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత ఫోన్ల చుట్టూనే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ మొబైల్స్ కథేంటి..? జనాలు ఏమనుకుంటున్నారు..? బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తోంది..? అసలు ఈ ఫోన్లను ఈడీ స్వీకరించిందా లేదా.. ? ఈడీ అడిగిన ఫోన్లు.. కవిత ఈడీకి సమర్పించిన ఫోన్లు రెండు ఒక్కటేనా..? కాదా..? ఈ మొబైల్స్ వ్యవహారంపై నిపుణులు ఏమంటున్నారు..? అనే ఆసక్తికర విషయాలపై ప్రత్యేక కథనం.

కాస్త లోతుగా పరిశీలిస్తే..!

లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత మొబైల్‌ను (Kavitha Personal Mobile) మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు (ED Officers) స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ స్టేట్మెంట్, బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను తన న్యాయవాది సోమా భరత్‌ ద్వారా ఈడీకి పంపారు. ఇవాళ వరుసగా రెండోరోజు కవిత విచారణ జరుగుతోంది. అయితే ఇవాళ కవిత కొన్ని మొబైల్ ఫోన్స్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మొబైల్ ఫోన్లను సీల్డ్ కవర్‌లో మీడియాకు చూపించారు. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. ఈడీ అధికారులు అడిగిన ఫోన్లనే కవిత ఇచ్చారా..? లేకుంటే ఈడీ అడిగింది కదా అని ఏదో కొన్ని ఫోన్లను కవిత సమర్పించారా..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. అయితే దీనిపై బీజేపీ నేతలు, టెక్ నిపుణులు చిత్రవిచిత్రాలుగా స్పందిస్తున్నారు. అయితే కవిత చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేసి చూస్తే.. మొత్తం ఐదు ఫోన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అందులోనే ఒకట్రెండు ఐఎంఈఐ నంబర్లు క్లారిటీగానే కనిపిస్తున్నాయి. కవిత అధికారికంగా మీడియా రిలీజ్ చేసిన ప్రకటనను చూసినా అందులో మూడు ఫోన్లు మాత్రమే 2021లో కొన్నట్లు.. మిగిలినవన్నీ 2022లోనే కొన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది గమనించిన బీజేపీ నేతలు కవిత చూపించిన ఫోన్లు పాతవి కానే కాదని.. కొత్తవి అని ఆరోపిస్తున్నారు. మొబైల్ ఫోన్ల ఫొటోలు, వీడియోలను జూమ్ చేసి చూసి.. వాటికున్న ఐఎంఈఐ నెంబర్లను చూపించి.. ఫోన్లు ఎప్పుడు కొన్నారు..? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

Kavitha-IMEI-Numbers.jpg

అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే..!?

ముఖ్యంగా కవిత మీడియాకు చూపించిన ఆ ఫోన్లలో ఒకటి ఐ ఫోన్ (I Phone) ఉండటంతో దాని ఐఎంఈఐ నంబర్‌ను (IMEI Number) ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (BJP Leader Vishnu Vardhan Reddy) కనిపెట్టారు. ఈ ఫోన్ లాంచ్ అయ్యింది 2022 సెప్టెంబర్‌లో అని.. అయితే కొన్నది మాత్రం అక్టోబర్‌లో అని స్పష్టంగా ఉందని నెటిజన్లు, బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. లిక్కర్ స్కామ్ బయటికొచ్చింది జులై నెలలో అనే విషయాన్ని కూడా ఇక్కడ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌కు, కొన్న తేదీకి.. స్కామ్ బయటికొచ్చిన తేదీకి అస్సలు ఎక్కడా మ్యాచ్ కావట్లేదని బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎవర్ని ఫూల్ చేయాలని కవిత అనుకుంటున్నారు..? అని బీజేపీ ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. ఇంత తక్కువ కాలంలో అన్ని ఫోన్లను మార్చాల్సిన అవసరం ఏంటి..? అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. మరోవైపు.. ఇదివరకు ఈడీ అధికారులు కవితతో పాటు పిళ్లై, బుచ్చిబాబుకు సంబంధించిన మొత్తం ఫోన్ కాల్ డేటా, ఫోన్ల వివరాలను 32 పేజీలతో రీలీజ్ చేశారు. అయితే.. అప్పట్లో ఈడీ అధికారులు రిలీజ్ చేసిన ఫోన్ నంబర్ వివరాలు, ఐఎంఈఐ నంబర్లు అస్సలు సూట్ కావట్లేదని.. విచారణలో ఈడీ అధికారులు కూడా కవితను ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Kavitha-Mobiles-IMEI-Number.jpg

విశ్లేషకుల మాట ఇదీ..

లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఫోన్ సంభాషణలన్నీ 2021లో జరిగాయి. అయితే కవిత ఈడీకి సమర్పించిన ఫోన్లనో ఒకే ఒక్కటి తప్ప మిగిలినవన్నీ 2022లో కవిత కొన్నారని స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలామంది తెలియకపోవడం వల్ల పలు రకాలుగా వార్తలు రాసేస్తున్నారని.. ఈ ఫోన్లకి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు ఎటువంటి సంబంధం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు.. ‘కవిత 9 ఫోన్లు ఎందుకు వాడుతున్నారు?. ఆమెకు ఏదైనా మొబైల్ షాప్ ఉందా..?. షాప్ ఓనర్లు కూడా ఇన్ని ఫోన్లు వాడరు. నిజానికి బుకీలు లేదా హవాలా/మనీలాండరింగ్ తరహా వ్యాపారాలు చేసే వ్యక్తులు ఆమె వలెనే ఎక్కువ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇది ఒప్పుకున్నట్టేనా?’ అని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

మొత్తానికి చూస్తే.. ఈడీ అడిగిన ఫోన్లకు, కవిత అధికారులకు సమర్పించిన ఫోన్లకు అస్సలు సంబంధమే లేదనే విషయం దీన్నిబట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ ఫోన్ల వ్యవహారంపై ఈడీ నుంచి.. కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

MLC Kavitha ED Enquiry : విచారణలో రివర్స్ అటాక్.. కవిత ప్రశ్నలకు ఈడీ అధికారులు నీళ్లు నమిలారా.. కొసమెరుపు ఏమిటంటే..!

******************************

Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు ఈడీకి కవిత సంచలన లేఖ.. ఇందులో లాజిక్ ఏమిటంటే..?


******************************
Kavitha ED Enquiry : ఈడీ విచారణకు వెళ్తూ పాత ఫోన్లు చూపించిన కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోయిన టెన్షన్..

******************************

MLC Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు కవిత కీలక సమావేశం.. ఈడీ ఆఫీసు చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు.. కీలక పరిణామాలుంటాయా..!?


******************************

Updated Date - 2023-03-24T16:43:31+05:30 IST