ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ.. ఏం చర్చించారంటే..?

ABN, Publish Date - Dec 22 , 2023 | 09:10 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఈరోజు ఆ పార్టీ నేతలతో జనసేన ( Janasena ) కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రానున్న ఎన్నికలల్లో జనసేన పోటీ చేసే స్థానాల ఎంపికపై పార్టీ నేతలతో చర్చించారు.

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఈరోజు ఆ పార్టీ నేతలతో జనసేన ( Janasena ) కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రానున్న ఎన్నికలల్లో జనసేన పోటీ చేసే స్థానాల ఎంపికపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ భేటీకి పీఎసీ సభ్యులు, పార్టీ కీలక నేతలను పవన్ కళ్యాణ్ పిలిపించారు. కేంద్ర కార్యాలయంలో పవన్, నాదెండ్ల మనోహర్ ఇరువురు కూర్చుని నేతలతో బలాబలాలపై చర్చలు జరిపారు. టీడీపీ, జనసేన పొత్తు నేపధ్యంలో ఇరు పక్షాల కార్యకర్తలు కలిసి పని చేసే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.

పోటీ చేసే స్థానాల్లో ఇరు పక్షాల బలాబలాలపై కూడా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. శనివారం (రేపు), ఆదివారం (ఎల్లుండి) కూడా ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించారు. రాబోయే రెండు రోజుల్లో చర్చల అనంతరం పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్ చర్చలు జరిపే అవకాశం ఉంటుంది.

Updated Date - Dec 22 , 2023 | 09:10 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising