Gurjala Malyadri : జగన్ విద్యారంగాన్ని దారుణంగా దిగజార్చారు
ABN, Publish Date - Dec 21 , 2023 | 05:21 PM
57 నెలల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) విద్యారంగాన్ని దారుణంగా దిగజార్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి ( Gurjala Malyadri ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...బహిరంగ మార్కెట్లో ఒక్కో ట్యాబ్ ధర రూ.11,200లు ఉంటే, రూ.15,500లకు కొని రెండేళ్లలో జగన్ రూ.470 కోట్ల కమీషన్లను నొక్కేశారని గురజాల మాల్యాద్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: 57 నెలల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) విద్యారంగాన్ని దారుణంగా దిగజార్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి ( Gurjala Malyadri ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘బహిరంగ మార్కెట్లో ఒక్కో ట్యాబ్ ధర రూ.11,200లు ఉంటే, రూ.15,500లకు కొని రెండేళ్లలో జగన్ రూ.470 కోట్ల కమీషన్లను నొక్కేశారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం 25,379 ట్యాబులకు కోత పెట్టారు. నాడు-నేడు ముసుగులో ప్రభుత్వ పాఠశాలలకు పార్టీ రంగులేసి రూ.3 వేలకోట్లను వైసీపీ ప్రభుత్వం కొట్టేసింది. పాఠశాల ప్రాంగణాల్లో రైతుబజార్లు ఏర్పాటు చేసి, హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన సిగ్గురాలేదు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు నిర్వహించలేదో.. ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఎందుకు భర్తీచేయలేదో జగన్ చెప్పాలి. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ‘ఫౌండేషనల్ లెర్నింగ్ న్యూమరసీ’ నివేదిక ప్రకారం.. 2022-23లో దేశంలో ఏపీ 29 వ స్థానానికి పడిపోయింది. ‘ఆరా’ నివేదిక ప్రకారం ఏపీలో 8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి లెక్కలు కూడా సరిగా చేయలేకపోతున్నారని తేలిపింది. పదో తరగతి ఉత్తీర్ణతాశాతంలో చంద్రబాబు పాలనలో 92.9శాతం నుంచి జగన్ పాలనలో ఉత్తీర్ణతాశాతం 67.76కు పడిపోయింది. ఇంగ్లీష్ మీడియాన్ని కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితం చేసి.. పేద విద్యార్థుల జీవితాలతో సీఎం జగన్‌రెడ్డి ఆటలాడారు. మేము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి.. సాక్షి మీడియాకు ఉందా’’ అని గురజాల మాల్యాద్రి ప్రశ్నించారు.
Updated Date - Dec 21 , 2023 | 05:21 PM