రేపు కొండగట్టు క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ABN, Publish Date - Jan 02 , 2026 | 09:54 PM
సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లి నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు(శనివారం) కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రానికి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలు చేయనున్నారు. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లి నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇవి చదవండి
మోదీకి క్షమాపణ చెప్పాల్సిందే..కూనంనేనిపై బండి సంజయ్ ఫైర్
స్కూల్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
Updated Date - Jan 02 , 2026 | 09:54 PM