Khammam Road Accident: స్కూల్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 08:45 PM
స్కూలు బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో 20 మంది పిల్లలు గాయాలపాలయ్యారు. పెనుబల్లి మండలం, గణేష్‌పాడులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు.
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్కూలు బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో 20 మంది పిల్లలు గాయాలపాలయ్యారు. పెనుబల్లి మండలం, గణేష్‌పాడులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. కాలువలో నీళ్లు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఊహించని దారుణం జరిగి ఉండేది.
డ్రైవర్ బస్సు అతి వేగంగా నడపటం వల్లే బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ విద్యార్థులను వైద్య సహాయం నిమిత్తం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
భారత్ భద్రతకు ముప్పు.. జైశంకర్‌కు బలోచ్ నేత సంచలన లేఖ
బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించిన కోర్టు