Share News

Vijayawada POCSO Case: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించిన కోర్టు

ABN , Publish Date - Jan 02 , 2026 | 08:16 PM

విజయవాడ భవానిపురం పరిధిలో 5 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. బాధిత బాలికకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Vijayawada POCSO Case: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించిన కోర్టు
Vijayawada POCSO Case

బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. బాలిక కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఆ వివరాల్లోకి వెళితే.. 2024 అక్టోబర్ 9వ తేదీన భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 5 సంవత్సరాల బాలిక ఆడుకోవటానికి షేక్ ఖాసీం అనే వ్యక్తి ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే షేక్ ఖాసీం బాలికపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటనపై అప్పటి మహిళా పీఎస్ ఏసీపీ డా. కే స్రవంతి రాయ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


తాజాగా, ఈ కేసుపై పోక్సో కోర్టు విచారణ జరిపింది. షేక్ ఖాసీంను దోషిగా తేల్చిన పోక్సో కోర్టు జడ్జి వేల్పుల భవాని అతడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. జైలు శిక్షతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా కూడా వేశారు. బాధిత బాలికకు 5 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించారు. కాగా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 15 నెలల కాలంలోనే బాలికపై అత్యాచారం చేసిన షేక్ ఖాసీంకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి

టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గాయం.. విరిగిన పక్కటెముక!

భూ వివాదాల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Jan 02 , 2026 | 08:21 PM