Year End News 2025: క్రైమ్ ఇయర్‌గా 2025.. జనాన్ని భయపెట్టిన మర్డర్ కేసులు ఇవే..
ABN, Publish Date - Dec 20 , 2025 | 02:03 PM
ముందెన్నడూ చూడని విధంగా 2025 సంవత్సరంలో క్రైమ్ రేట్ తారాస్థాయికి చేరుకుంది. దేశ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా నేరాలు చోటుచేసుకున్నాయి.
ముందెన్నడూ చూడని విధంగా 2025 సంవత్సరంలో క్రైమ్ రేట్ తారాస్థాయికి చేరుకుంది. దేశ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా నేరాలు చోటుచేసుకున్నాయి. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్స్ జరిగాయి. మీర్‌పేట్ మాధవి కేసుతో మొదలు పెడితే.. మీరట్ బ్లూ డ్రమ్ కేసు వరకు జనాన్ని షాక్‌కు గురి చేశాయి. దేశాన్ని భయపెట్టిన టాప్ 4 మర్డర్ కేసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లూ డ్రమ్ మర్డర్ కేసు..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. శవాన్ని ముక్కలు చేసి బ్లూ డ్రమ్‌లో పడేశారు.
హనీమూన్ మర్డర్ కేసు..
మధ్య ప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ తన భార్య సోనంతో మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లాడు. అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించకుండా పోయాడు. కొద్ది రోజుల తరువాత అతని మృతదేహం లభ్యమవడంతో ఈ ఘటన హత్యేనని పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. పెళ్లి ఇష్టం లేని సోనం ప్రియుడితో కలిసి రఘువంశీని హత్య చేయించిందని తేలింది. హనీమూన్ సమయంలో కాంట్రాక్ట్ కిల్లర్ల సాయంతో భర్తను హత్య చేయించిందని వెల్లడైంది.
రాధిక యాదవ్ కేసు
హరియాణాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను కన్నతండ్రి దీపక్ యాదవ్ దారుణంగా హత్య చేశాడు. తుపాకితో కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. 25 ఏళ్ల రాధిక యాదవ్ టెన్నిస్ ఆటలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తన విద్యను నలుగురికి పంచాలని అనుకుంది. స్వతంత్రంగా తన కాళ్లపై తను బతకాలని భావించింది. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా టెన్నిస్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తండ్రి ఎంత చెప్పినా కోచింగ్ సెంటర్‌ను మూసివేయలేదు. రాధిక యాదవ్ సొంతంగా టెన్నిస్ అకాడమీ నడుపుతుండటంతో ఇరుగుపొరుగు వారు దీపక్‌ను హేళన చేయటం మొదలెట్టారు. కుమార్తె సంపాదనతో బతుకుతున్నావని హేళన చేస్తున్నారు. దీంతో అకాడమీని మూసివేయమని కూతురిపై బాగా ఒత్తిడి తెచ్చాడు. ఎంత చెప్పినా తన కుమార్తె వినిపించుకోలేదు. దానికి తోడు రాధిక ఇన్‌స్టాలో రీల్స్ చేస్తుండటంతో దీపక్ ఆమెను చంపేశాడు.
మీర్‌పేట్ మాధవి కేసు
2025 జనవరి నెలలో హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో నివాసం ఉంటున్న గురుమూర్తి తన భార్య మాధవిని దారుణంగా హత్య చేశాడు. మరదలితో ఎఫైర్ కారణంగా భార్యను చంపి శవాన్ని ముక్కలు, ముక్కలు చేశాడు. శరీర భాగాలను ఉడకబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి చెరువులో పడేశాడు. చాలా తెలివిగా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పూర్తి కాలం జవానుగా పని చేసి రిటైర్ అయ్యాడు. తర్వాత ప్రైవేటు కంపెనీలో పనికి కుదిరాడు. భార్యను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే.. ముందస్తుగా తన ఇద్దరు పిల్లలను గురుమూర్తి బంధువుల ఇంట్లో ఉంచి వచ్చాడు. జనవరి 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే వెంకట మాధవితో గురుమూర్తి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మాధవిని చెంపపై కొట్టగా గోడకు తాకి కుప్పకూలింది. స్పృహ కోల్పోయిన ఆమెపై కూర్చొని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
ఇవి కూడా చదవండి
క్రిస్మస్, న్యూ ఇయర్‌కు రెండు ప్రత్యేక రైళ్లు..
కాలికి కాలు, చెయ్యికి చెయ్యికి అనేలా ట్రీట్ చేస్తే... వారంతా కకావికలమే: పవన్
Updated Date - Dec 20 , 2025 | 02:11 PM