Meteorological Department: కోస్తా, సీమలపై మంచు దుప్పటి
ABN, Publish Date - Dec 31 , 2025 | 05:55 AM
కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం మంచు దట్టంగా కురిసింది.
విశాఖపట్నం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం మంచు దట్టంగా కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖపట్నం విమానాశ్రయం రన్‌వేపై విజిబిలిటీ 1000 మీటర్లకు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో గాలిలో తేమశాతం 100గా నమోదైంది. మధ్య భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి వాతావరణం నెలకొంది. రానున్న రెండు, మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత చలి స్వల్పంగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
Updated Date - Dec 31 , 2025 | 05:56 AM